Aloo Corn Cutlet Recipe । కరకరలాడే ఆలూ కార్న్ కట్‌లెట్.. ఉక్కిరిబిక్కిరి చేస్తుంది దీని టేస్ట్!-crispy tasty aloo corn cutlet to pair with your evening tea quick recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloo Corn Cutlet Recipe । కరకరలాడే ఆలూ కార్న్ కట్‌లెట్.. ఉక్కిరిబిక్కిరి చేస్తుంది దీని టేస్ట్!

Aloo Corn Cutlet Recipe । కరకరలాడే ఆలూ కార్న్ కట్‌లెట్.. ఉక్కిరిబిక్కిరి చేస్తుంది దీని టేస్ట్!

HT Telugu Desk HT Telugu
Oct 18, 2022 06:13 PM IST

బయటి నుండి క్రిస్పీగా, లోపల నుండి మృదువుగా, తింటున్నకొద్దీ ఎంతో రుచికరంగా అనిపించే Aloo Corn Cutlet Recipe ఇక్కడ ఉంది. చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి.

Aloo Corn Cutlet Recipe
Aloo Corn Cutlet Recipe (slurrp)

ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ ఇంతేనా.. కేవలం మూడు పూటలు తింటే సరిపోతుందా? మధ్యమధ్యలో పంటి కింద దంచడానికి స్నాక్స్, అలాగే చాయ్-కాఫీలు ఉంటే అప్పుడు అసలైన సంతృప్తి లభిస్తుంది. సాయంత్రం వేళ తినడానికి మనకు చాలా రకాల చిరుతిళ్లు ఉన్నాయి. అందులో కట్‌లెట్స్ చాలా మంది ఇష్టపడే స్నాక్స్‌లో ఒకటి. బయటి నుండి క్రిస్పీగా, లోపల నుండి మృదువుగా, తింటున్నకొద్దీ ఎంతో రుచికరంగా అనిపించే కట్‌లెట్స్‌ను తినకుండా ఎవరూ నో చెప్పలేరు.

ఈ కట్‌లెట్లు తయారు చేయడానికి తక్కువ పదార్థాలు అవసరం అవుతాయి, త్వరగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఆలూ కీమా కట్‌లెట్, ఆనియన్ బ్రెడ్ కట్‌లెట్ అంటూ వెరైటీలు కూడా చేసుకోవచ్చు. కట్‌లెట్‌లతో ప్రయోగాలు చేయడానికి ఎటువంటి పరిమితి లేదు. అందుకే, మీకోసం ఇప్పుడు ఎంతో రుచికరమైన ఆలూ కార్న్ కట్‌లెట్ రెసిపీని అందిస్తున్నాము. దీని రుచికి మీరు ఉక్కిరిబిక్కిరి అవుతారు.

మరి ఆలస్యం చేయకుండా ఆలూ కార్న్ కట్‌లెట్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూసి నేర్చేసుకోండి.

Aloo Corn Cutlet Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు మొక్కజొన్న
  • 2 మీడియం బంగాళదుంపలు
  • 1/2 ఉల్లిపాయ
  • 1/4 క్యాప్సికమ్
  • 1 పచ్చిమిర్చి
  • 1/2 స్పూన్ అల్లం పేస్ట్
  • 1/2 స్పూన్ కారం
  • 1/2 టీస్పూన్ పసుపు
  • 1/2 స్పూన్ గరం మసాలా
  • 1 టేబుల్ స్పూన్ శనగపిండి
  • 1/4 కప్పు బ్రెడ్ ముక్కలు
  • 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి
  • 1/4 టీస్పూన్ మిరియాల పొడి
  • 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
  • 1/4 టీస్పూన్ ఉప్పు
  • వేయించడానికి నూనె

ఆలూ కార్న్ కట్‌లెట్ తయారీ విధానం

  1. ముందుగా మొక్కజొన్నను ఉడికించుకొని ఒక చిన్న బ్లెండర్‌లో కొన్ని నీళ్లు కలుపుకుంటూ పేస్ట్ చేసుకోవాలి. క్రిస్పీగా ఉండేందుకు మొక్కజొన్న గింజలను కొన్ని అలాగే ఉంచుకోవాలి.
  2. ఈ మొక్కజొన్న పేస్టుకు మెత్తగా ఉడికించిన బంగాళదుంప గుజ్జు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలను కలుపుకోవాలి.
  3. ఆపై కారం, ఉప్పు, అల్లం పేస్ట్, సుగంధ ద్రవ్యాలు వేసుకొని బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి.
  4. అనంతరం మిశ్రమానికి బ్రెడ్ ముక్కలు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న గింజలు, నిమ్మరసం, పొడులు వేసి మెత్తని పిండిముద్దలా చేసుకోవాలి.
  5. కట్‌లెట్ మిశ్రమం సిద్ధమైనట్లే.. ఇప్పుడు చేతులకు నూనె రాసుకొని చిన్నచిన్న కట్‌లెట్లుగా చేసుకోవాలి.
  6. ఈ కట్‌లెట్లను వేడి నూనెలో డీప్ ఫ్రై చేసి, అనంతరం మీడియం మంట మీద బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి.

అంతే ఆలూ కార్న్ కట్‌లెట్లు సిద్ధమైనట్లే. వీటిని సర్వింగ్ ప్లేట్లలోకి తీసుకొని చట్నీ లేదా టొమాటో సాస్ అద్దుకుంటూ తినండి, మసాలా చాయ్ తాగుతూ సాయంత్రాన్ని ఆస్వాదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్