Aloo Keema Cutlets | సాయంత్రానా ఆలూ కీమా కట్‌లెట్.. వాహ్‌వా అనిపించే టేస్ట్!
సాయంత్రం వేళ క్రిస్పీగా, టేస్టీగా ఏదైనా స్నాక్స్ తింటూ, టీ తాగుతూ, మన వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో కదా? మీకోసం ఇక్కడ క్రిస్పీ ఆలూ కీమా కట్‌లెట్స్ రెసిపీ అందిస్తున్నాం. ఇది సాయంత్రానికి సరైన స్నాక్స్.
చిరుతిళ్లు తినటం అంటే చాలా మందికి ఇష్టం. సాయంత్రం అవ్వగానే, టీ-టైంలో రుచికరమైన స్నాక్స్ తింటూ స్నేహితులతో కలిసి ముచ్చట్లు పెడితే వచ్చే మజానే వేరు. ఇంట్లో కూర్చోని టీవీ చూస్తూ లేదా వర్క్ ఫ్రమ్ హోం చేసే వారైతే డెస్క్ వద్ద పెట్టుకొని చిరుతిళ్లు తింటుంటే సరదాగా ఉంటుంది, ఇవి మన ఆకలిని తీర్చుతాయి. రాత్రి భోజనం వరకు మనం చురుకుగా ఉండవచ్చు.
చిరుతిళ్లలో చాలా రకాలు ఉన్నాయి, మరి మీరెప్పుడైనా ఆలూ కీమా కట్‌లెట్‌లు తిన్నారా? వీటి రుచి అమోఘంగా ఉంటుంది. సాయంత్రం వేళ మంచి స్నాక్స్ లా ఇవి ఉంటాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా బంధువుల అంతా కలిసి ఒకచోట చేరి ఆత్మీయ సమావేశం ఏర్పర్చుకున్నపుడు ఈ కట్‌లెట్‌లు తింటూ మంచి సమయాన్ని ఆస్వాదించవచ్చు. రైలు ప్రయాణం చేసేటపుడైనా టిఫిన్ బాక్స్‌లలో ఈ ఆలూ కీమా కట్‌లెట్‌లు తీసుకెళ్లవచ్చు. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేమిటో ఇక్కడ రెసిపీ అందించాం. మీ ఇంట్లో మీరూ ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు
- 250 గ్రాముల మటన్ కీమా
- 3-4 ఆలుగడ్డలు
- 1 టేబుల్ స్పూన్ పాలగుండ గడ్డ
- 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి
- 4 పచ్చిమిర్చి
- 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి
- 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి
- 2 టేబుల్ స్పూన్లు అల్లం-వెల్లుల్లి పేస్ట్
- 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్
- 1 టేబుల్ స్పూన్ ఉప్పు
- 1/4 గరం మసాలా పొడి
- 1 తరిగిన ఉల్లిపాయ
- వేయించటానికి నూనె
- 1/2 కప్పు నీరు
- కొత్తిమీర, పుదీనా
తయారీ విధానం
- ఒక గిన్నెలో మటన్ కీమా తీసుకోండి. అందులో తరిగిన పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా ఉప్పు వేసి బాగా కలపండి. దీనిని 15 నిమిషాలు పక్కన పెట్టండి.
- అనంతరం ప్రెజర్ కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి, ఉల్లిపాయ ముక్కలను 5 నిమిషాల పాటు వేయించండి.
- ఇప్పుడు మెరినేట్ చేసిన కీమా వేసి 2 నిమిషాలు కలపాలి. ఈ కీమాలోకి అర కప్పు నీరు వేసి, మూతపెట్టి ఉడికించాలి.
- కీమాను 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన కీమాలో ఇంకా నీరు ఉంటే, అది ఆవిరైపోయే వరకు ఎక్కువ మంటపై ఉడికించాలి. అనంతరం ప్లేట్‌లో తీసుకుని చల్లారనివ్వాలి.
- ఇప్పుడు ఉడికించిన ఆలుగడ్డ ముక్కలను తీసుకొని, పీల్ చేసి మెత్తగా కొట్టండి. ఆపై కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి వేసి కలపాలి.
- ఇప్పుడు ఆలుగడ్డ మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ యారోరూట్, 1 చెంచా బియ్యపు పిండిని వేయండి. ఇది కట్లెట్లను క్రిస్పీగా మార్చుతుంది. తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి బాగా అన్నింటిని కలపండి.
- ఇప్పుడు కట్లెట్స్ చేయడం ప్రారంభించండి. పైమిశ్రమాన్ని చేతితో ముద్దలుగా తీసుకొని గిన్నె ఆకృతిలో మార్చి అందులో కీమాను స్టఫ్ చేయండి. ఆపై జాగ్రత్తగా ప్యాక్ చేయండి.
- ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. మంట తక్కువగా ఉంచండి.
- ఇప్పుడు కట్లెట్లను వేడి పాన్ మీద వేసి 2-3 నిమిషాల పాటు రెండు వైపులా క్రిస్పీగా మారేంతవరకు కాల్చండి.
అంతే, ఆలూకీమా కట్‌లెట్‌లు సిద్ధం అయినట్లే నచ్చిన చట్నీ అద్దుకుంటూ వేడివేడిగా టీతాగుతూ వీటి రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం