మీ ఉదయానికి రుచికరమైన స్టార్ట్.. రవ్వ ఆలూ బోండాతో బ్రేక్ ఫాస్ట్!-spruce up your morning meal with this aloo rawa bonda recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ ఉదయానికి రుచికరమైన స్టార్ట్.. రవ్వ ఆలూ బోండాతో బ్రేక్ ఫాస్ట్!

మీ ఉదయానికి రుచికరమైన స్టార్ట్.. రవ్వ ఆలూ బోండాతో బ్రేక్ ఫాస్ట్!

Manda Vikas HT Telugu
Dec 28, 2021 02:59 PM IST

ఆలూ, మైసూర్ బోండాలూ చాలా సార్లు తినే ఉంటాం, కానీ ఎప్పుడైనా ఆలూ రవ్వ బోండా తిన్నారా? ఇది తయారు చేసుకోవటానికి పెద్దగాటైం కూడా పట్టదు. కేవలం 30 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సాయంత్రం టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ లాగా తీసుకుంటూ ఆస్వాదించవచ్చు. ఇక వర్షం పడేటపుడు, చలికాలంలో కూడా ఆహా అనిపిస్తుంది.

Aloo Rawa Bonda
Aloo Rawa Bonda (Stock Photo)

మనకు ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీ, వడ, దోశ అంటూ ఎన్ని రకాల వెరైటీలు ఉన్నా, సాయంత్రం సమయంలో ఎన్ని వెరైటీల స్నాక్స్ అందుబాటులో ఉన్నా రోజూ అదే తింటూపోతే ఎప్పుడూ ఇదేనా అన్నట్లుగా మొఖం మొత్తినట్లు అనిపిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు కొంచెం కొత్తరకం రుచులు కూడా ప్రయత్నిస్తే పిల్లలైనా, పెద్దలైనా కొంచెం తినటానికి ఆసక్తి చూపిస్తారు. మనం ఆలూ బోండా, మైసూర్ బోండా చాలా సార్లు తినే ఉంటాం, కానీ ఎప్పుడైనా ఆలూ రవ్వ బోండా తిన్నారా? ఇది తయారు చేసుకోవటానికి పెద్దగా టైం కూడా పట్టదు. కేవలం 30 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దీనిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లాగా తినొచ్చు, అలాగే సాయంత్రం టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ లాగా తీసుకుంటూ ఆస్వాదించవచ్చు. ఇక వర్షం పడేటపుడు, చలికాలంలో కూడా ఆహా అనిపిస్తుంది.

మరి ఆలూ రవ్వ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలేమిటి? దీనిని ఎలా తయారు చేసుకోవాలో వివరంగా ఇచ్చాము, చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.

ముందుగా రవ్వ మిశ్రమం తయారు చేసుకోవాలి, ఇందుకు కావాల్సిన పదార్థాలు:

4 మీడియం బంగాళాదుంపలు - ఉడకబెట్టి మెత్తగా చేసినవి

2 టేబుల్ స్పూన్లు రవ్వ

కప్ పెరుగు

1 కప్ ఉడికించిన మొక్కజొన్న గింజలు - కొద్దిగా గ్రైండ్ చేసినవి

½ మీడియం ఉల్లిపాయ - ముక్కలు

కొత్తిమీర

ఉప్పు రుచికి తగినంత

½ స్పూన్ బేకింగ్ సోడా

1 స్పూన్ నూనె

ముద్దలుగా మిశ్రమం చేసుకోవటానికి కొద్దిగా నీరు కలుపుకోవచ్చు.

1 స్పూన్ జీలకర్ర

1 స్పూన్ మినపప్పు

1 చిన్న అల్లంముక్క తరిగినది

2 తాజా పచ్చి మిరపకాయలు - తరిగినవి

1 కరివేపాకు రెమ్మ

పావు టీ స్పూన్ ఇంగువ

1/4 టీ స్పూన్ పసుపు

1/2 టీ స్పూన్ కారంపొడి

వేయించటానికి సరిపడే నూనె.

తయారు చేసే విధానం:

ముందుగా ఒక గిన్నెలో రవ్వ తీసుకొని, అంతే పరిమాణంలో పెరుగు వేసి మంచిగా కలపి ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. అప్పుడు ఈ మిశ్రమం మెత్తగా తయారవుతుంది. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపలు కూడా నుజ్జుగా చేసి రవ్వ మిశ్రమానికి కలుపుకోవాలి, అలాగే ఉడికించిన మొక్కజొన్న గింజలు, కొత్తిమిరా, ఉల్లిపాయముక్కలు, బేకింగ్ సోడా, ఉప్పు, కారం, జీలకర్ర మిగతా అన్ని పదార్థాలను వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తే అంటుకోకుండా ఉంటుంది. 

అనంతరం ఈ మిశ్రమాన్ని గుండ్రగా లేదా కట్ లెట్స్ లాగా చేసుకోని నూనెలో వేయించాలి. అన్ని వైపుల నుండి బంగారు గోధుమరంగు వచ్చేన తర్వాత వేయించి బయటకు తీస్తే, కరకరలాడే ఆలూ రవ్వ బోండా రెడీ అయినట్లే. దీనిని సలాడ్ లేదా గ్రీన్ చట్నీతో లేదా అలాగే కూడా వడ్డించవచ్చు. అయితే మీరు ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపించే వారైతే, ఈ రెసిపీ మీకు కావాల్సినది కాదు. అప్పుడప్పుడూ మాత్రం కొత్త రుచుల కోసం ఇలా ప్రయత్నించవచ్చు.

 

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్