Kheema Paratha Recipe | కీమా పరాటాతో బ్రేక్‌ఫాస్ట్, ఆదివారం అంటే మినిమం ఇలా ఉండాలి!
Kheema Paratha Recipe: ఆదివారం కూడా ఇడ్లీలు, దోశలేనా.. స్పెషల్ గా ఉదయం కీమా పరాటాతో బ్రేక్ ఫాస్ట్ చేయండి, మధ్యాహ్నం ముర్గ్ ముసల్లం తినండి, నైట్ రెండూ కలిపి తినండి. ఖీమా పరోటా రెసిపీని ఇక్కడ చూడండి.
Kheema Paratha Recipe: ఆదివారం బ్రేక్‌ఫాస్ట్ అంటే కొంచెం ప్రత్యేకత ఉండాలి. ఎందుకంటే మిగతా వారం రోజులు ఎవరిపనుల్లో వారు బిజీబిజీగా ఉంటారు. ఉదయం అల్పాహారం చేసుకోడానికి సమయం అనేది చిక్కదు. బ్రేక్ ఫాస్ట్ చేస్తే చేస్తారు, లేకపోతే చేయకుండా అలాగే వెళ్లిపోతారు. మరి కాబట్టి సెలవు రోజైనా కాస్త రుచికరంగా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా. అందులోనూ ఆదివారం, ఇప్పటికే మసాలాలు సిద్ధం చేసి ఉంటారు. అదే చేతితో ఒక మంచి అల్పాహారం కూడా సిద్ధం చేసుకోండి.
ఈరోజు మీకోసం ప్రత్యేకంగా కీమా పరాటా రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాం. ఇది చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ అదిరిపోతుంది. మంచి ప్రోటీన్లతో నిండి ఉంటుంది కాబట్టి శక్తివంతమైన ఆహారం. మీరు దీని బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు, మధ్యాహ్నం లంచ్‌లోనూ తినొచ్చు, సాయంత్రం స్నాక్స్‌లా, డిన్నర్‌లోకి తినొచ్చు. ఎప్పుడైనా తినొచ్చు, ఎక్కడైనా తినొచ్చు.
మరి ఆలస్యం చేయకుండా కీమా పరాటా తయారీ కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
Kheema Paratha Recipe కోసం కావలసినవి
- 300 గ్రాముల మటన్ ఖీమా
- 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ
- 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 స్పూన్ ధనియాల పొడి
- 1 స్పూన్ కారం
- 1/4 టీస్పూన్ పసుపు పొడి
- 1/2 టీస్పూన్ గరం మసాలా పొడి
- 1/2 టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి
- 1 స్పూన్ నిమ్మరసం
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- రుచికి తగినట్లుగా ఉప్పు
- తాజా కొత్తిమీర
- పరాటా కోసం
- 2 కప్పుల గోధుమ/ మైదా పిండి
- 1/2 టీస్పూన్ ఉప్పు
- 2 టేబుల్ స్పూన్లు నూనె
కీమా పరాటా రెసిపీ- తయారీ విధానం
1. ముందుగా పాన్‌లో నూనెను వేడి చేసి, అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలను మీడియం మంట మీద వేయించండి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేయించండి.
2. ఇప్పుడు మటన్ కీమా వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఎక్కువ మంట మీద వేయించాలి. కీమాను కలుపుతూ ఉండాలి.
3.ఇప్పుడు ధనియాల పొడి, కారం, పసుపు, గరం మసాలా పొడి, జీరా పొడి, ఉప్పు అన్నీ వేసి ప్రతిదీ బాగా కలపాలి.
4. పొడులు అన్ని వేశాక ఒక కప్పు నీరు పోసి పాన్‌ను మూత పెట్టండి. దీనిని 40-45 నిమిషాలు తక్కువ వేడి మీద ఉడికించాలి.
5. 45 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికించండి, కీమాలోని నీరు పోయే వరకు కలుపుతూ అధిక మంట మీద ఉడికించండి. కీమా రెడీ అయినట్లే స్టఫ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు పరాటాలు చేసుకోవాలి.
6. పిండి, నీరు కలిపి మెత్తని ముద్దలాగా చేసుకోని చిన్నచిన్న ముద్ధలుగా విభజించండి. చిన్నని వృత్తాకారంలో రోల్ చేసుకోండి.
7. ఇప్పుడు ఒక్కో పరోటాకు 2 స్పూన్ల కీమాను స్టఫ్ చేసి, పరోటాలాగా రోల్ చేసుకోండి.
8. ఇప్పుడు పెనంపై కొద్దిగా నూనె వేడిచేసి పరోటాలను రెండు వైపులా నూనె పూసి రంగు మారేంత వరకు కాల్చుకోండి.
9. పరోటా సమాంతరంగా వచ్చేలా మధ్యమధ్యలో పరోటాను నొక్కుతూ ఉండండి.
అంతే రుచికరమైన కీమా పరాటా రెడీ అయినట్లే, రైతాతో కలిపి తింటే అదిరిపోతుంది.
సంబంధిత కథనం