Gobi Paratha । రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లకు చెప్పండి టాటా.. ఆస్వాదించండి గోబి పరాఠా!-spruce up your monday morning with the spiciness of gobi paratha ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Spruce Up Your Monday Morning With The Spiciness Of Gobi Paratha

Gobi Paratha । రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లకు చెప్పండి టాటా.. ఆస్వాదించండి గోబి పరాఠా!

HT Telugu Desk HT Telugu
Jun 13, 2022 08:47 AM IST

ప్రతిరోజూ ఇడ్లీ, దోశ అంటూ రొటీన్ అల్పాహారాలు ఎందుకు? నాలుకకు రుచి తగిలేలా, ఆరోగ్యం పెరిగేలా అద్భుతమైన గోబీ పరాఠా రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఈ అల్పాహారాన్ని ఎప్పుడైనా తినొచ్చు కూడా. మరి తెలుసుకోండి.

Gobi Paratha
Gobi Paratha (iStock)

బ్రేక్‌ఫాస్ట్ కోసం బ్రెడ్ జామ్, శాండ్‌విచ్ అంటూ ఇప్పుడు ఏవేవో ఇన్‌స్టంట్ అల్పాహారాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి కానీ పరాఠాలు, రొట్టెలు మన భారతీయ వంటకాల్లో ఎప్పట్నించో ఉన్నాయి. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి కూడా.  ఎప్పుడూ బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ జామ్ ఇలా బయట నుంచి తెచ్చుకునే పదార్థాలు,  మైదాపిండితో చేసినవి కాకుండా ఇంట్లో మనకోసం మనమే పరాఠాలు చేసుకొని తింటే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఎన్నో విధాలుగా మంచిది.

మీకోసం ఇక్కడ ఒక తేలికైన, ఆరోగ్యకరమైన గోబి పరాఠా రెసిపీని అందిస్తున్నాం. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని సులభంగా చేసుకోవచ్చు. ఈ పరాఠాను బ్రేక్‌ఫాస్ట్‌లో తినవచ్చు, మధ్యాహ్నం లంచ్‌లో తినవచ్చు అలాగే రాత్రి భోజనంలో కూడా తినొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

గోబి పరాఠాకు కావలసినవి

  • కాలీఫ్లవర్ - 1
  • కొత్తిమీర - ½ కప్పు
  • అల్లం - 1 అంగుళం
  • పచ్చిమిరప కాయలు - 2
  • పసుపు పొడి - చిటికెడు
  • గరం మసాలా పొడి - ½ టీస్పూన్
  • ఎర్ర మిరప పొడి - ½ టీస్పూన్
  • ఇంగువ - చిటికెడు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • రుచికి తగినంత ఉప్పు
  • అవసరమైనంత నూనె

తయారీ విధానం

  1. గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పువేసి, ఒక టీస్పూన్ నూనెతో బాగా కలపండి. ఆ గోరువెచ్చని నీళ్ళు పోసి పరాఠాలు చేసుకునే విధంగా మెత్తని పిండిని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి.
  2. కాలీఫ్లవర్ ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లంను పేస్ట్ లాగా చేసుకోవాలి. మిరపకాయలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  3. ఒక పాన్ లో నూనె వేడి చేయండి. ఆపైన జీలకర్ర, ఇంగువ, అల్లం పేస్టు, పచ్చిమిర్చి వరుసగా వేసి వేయించాలి.
  4. ఇప్పుడు ఆ పాన్ లో కాలీఫ్లవర్ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు ఉడికించి పసుపు, కారం, గరం మసాలా పొడులు, కొత్తిమీర వేసి, కొద్దిగా ఉప్పు చల్లాలి. మూత పెట్టి కాలీఫ్లవర్ మెత్తగా మారే వరకు 5 నిమిషాల పాటు ఉడికించండి.
  5. ఇలా ఉడికిన కాలీఫ్లవర్ కూరను వేరొక గిన్నెలోకి మార్చుకొని, చల్లబరచండి.
  6. ఇప్పుడు పరాఠాల కోసం సిద్ధం చేసుకున్న పిండిని తీసుకొని చపాతీలుగా చేసుకోవాలి.
  7. చపాతీలు పూర్తయ్యాక రెండు చపాతీల మధ్యన 2 టేబుల్ స్పూన్ల కాలీఫ్లవర్ కూరను స్టఫింగ్ వేయండి. చపాతీ నిండుగా పరిచి ఆ తర్వాత చపాతీల అంచులను నొక్కుతూ మూసివేయండి.
  8. ఇప్పుడు తవాను వేడి చేసి, కొద్దిగా నూనె వేసి, ఈ పరాఠాలను బంగారు రంగు వచ్చేవరకు కాల్చండి.

అంతే రుచికరమైన వేడివేడి పరాఠాలు సిద్ధమైపోయినట్లే. వీటిని సర్వింగ్ ప్లేట్లలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ పరాఠాలను నేరుగా తినేయవచ్చు. మీరు కావాలనుకుంటే పెరుగు లేదా ఏదైనా చట్నీతో లాగించవచ్చు. కొద్దిగా వెన్న అద్దుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్