Buttery Corn On The Cob | వెన్నపూస పూసి, ఉప్పు-కారం రాసి తింటే దీని రుచి అమోఘం!-enjoy monsoon evenings with smooth buttery corn on the cob recipe here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Buttery Corn On The Cob | వెన్నపూస పూసి, ఉప్పు-కారం రాసి తింటే దీని రుచి అమోఘం!

Buttery Corn On The Cob | వెన్నపూస పూసి, ఉప్పు-కారం రాసి తింటే దీని రుచి అమోఘం!

HT Telugu Desk HT Telugu
Jun 29, 2022 05:29 PM IST

వర్షాకాలంలో సాయంత్రం వేళ మొక్కజొన్న పొత్తులు తింటుంటే బాగుంటుంది కదా? మరి మీరెపుడైనా బటరీ కార్న్ ఆన్ ద కాబ్ తిన్నారా? తినకపోతే తప్పకుండా తినండి, రెసిపీ ఇక్కడ ఇస్తున్నాం.

<p>Buttery Corn Cob</p>
Buttery Corn Cob (Unsplash)

ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే నచ్చనివారు ఎవరూ ఉండరు. ఏ సీజన్‌లోనైనా తినకుండా ఉండలేరు. కానీ వర్షాకాలంలో మీరు బయట లభించే చిరుతిళ్లకు దూరంగా ఉండాలని ఉన్నా ఉండలేకపోతే.. మీకు ఇంట్లోనే సులభంగా, మరెంతో రుచికరంగా చేసుకునే ఎన్నో అద్భుతమైన రెసిపీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

ఈ వర్షాకాలంలో నూనెతో చేసే పదార్థాల కంటే ఇంగువ, కరివేపాకు, టొమాటో, ఎర్ర మిరపకాయలు, కొబ్బరి, ఆవాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వంటి పదార్థాలను కలిపి వేడివేడిగా చేసుకునే రసం, సూప్ వంటివి మంచి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

అయితే మీకు ద్రవాలు కాకుండా పొడిగా ఉండే స్నాక్స్ కావాలనుకుంటే ఈ మాన్ సూన్ సీజన్ లో మొక్కజొన్న మరొక మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మొక్కజొన్నను ఉడికించుకొని తినొచ్చు, కాల్చుకొని తినొచ్చు మరెన్నో రకాలుగా రుచికరమైన వంటకాలుగా తయారుచేసుకొని తినొచ్చు.

అయితే మీరు ఎప్పుడైనా 'బటరీ కార్న్ ఆన్ ద కాబ్' తిన్నారా? దీనిని చేసుకోవడం చాలా సులభం. మొక్కజొన్న కంకికి వెన్నపూసి, ఉప్పుకారం రాసి తినడమే. ఇలా ఎంతో రుచికరంగా ఉంటుంది కూడా. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో పూర్తి రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. మీరు కూడా తప్పకుండా చేసుకోండి.

కావాల్సిన పదార్థాలు

  • 2 స్వీట్ కార్న్ కంకులు
  • 4 స్పూన్ల కరిగించిన వెన్న
  • రుచికి తగినంత
  • రుచికి తగినంత కారం పొడి
  • 1 నిమ్మకాయ

తయారీ విధానం

  1. ముందుగా మొక్కజొన్న కంకులపై 1 టీస్పూన్ కరిగించిన వెన్నపూయండి.
  2. అనంతరం ఈ మొక్కజొన్న కంకులను మైక్రోవేవ్‌లో 5 నిమిషాల పాటు బేక్ చేయండి లేదా పెనంపై బోలు మూతపెట్టి చిన్న మంటతో వేదిచేయండి.
  3. ఆ తర్వాత బయటకు తీసి రెండు కంకులపై మళ్లీ సమానంగా కరిగించిన వెన్నపూసి ఆపై ఉప్పు, కారం చల్లి. నిమ్మరసం పిండుకోండి.
  4. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వెంటనే సర్వ్ చేసుకోండి.

ఇది తింటుంటే వెన్నపూస మెత్తదనం, మొక్కజొన్న తియ్యదనం, కారం, ఉప్పు, పులుపు ఇలా అన్ని రుచులు వెచ్చగా నోటికి తగిలి ఒక గొప్ప అనుభూతిని పొందుతారు.

Whats_app_banner

సంబంధిత కథనం