Blood clotting: ప్రతి విషయానికి ఆందోళన పడకండి, రక్తం గడ్డ కట్టేస్తుందంటున్న అధ్యయనం
Blood clotting: ఆందోళన, డిప్రెషన్ వల్ల సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివరాలు తెల్సుకోండి.
ఆందోళన లేదా నిరాశ ఎక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన రక్తం గడ్డకట్టే పరిస్థితి వచ్చే ప్రమాదం దాదాపు 50 శాతం పెరుగుతుందని కొత్త అధ్యయనం చెబుతోంది.
మెదడులో పెరిగిన ఒత్తిడి-సంబంధిత చర్యలు, మంటతో పాటు - మానసిక అనారోగ్యాల కారణంగా - లోతైన సిరల థ్రోంబోసిస్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని బ్రెయిన్ ఇమేజింగ్ లో తెలిసింది. దీనిలో సిర లోపల రక్తం గడ్డకడుతుంది.
మూడేళ్ల వ్యవధిలో 1,781 మంది పాల్గొన్నవాళ్లలో (1.5 శాతం) రక్తం గడ్డకట్టే పరిస్థితిని కనుగొన్నారు.
డిప్రెషన్ వల్ల రక్తం గడ్డ కడుతుంది:
ఆందోళన లేదా డిప్రెషన్ రెండింట్లో ఏదో ఒకటి ఉన్నా సిర థ్రాంబోసిస్ రావడానికి 50 శాతం కారణం అని తేలింది. అదే రెండూ ఉంటే 70 శాతం అవకాశాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో తెలిసింది.
అందుకే ఈ ఫలితాల వల్ల ఆందోళన రుగ్మతలు, డిప్రెషన్‌ను సిర థ్రాంబోసిస్కు శక్తివంతమైన ప్రమాద కారకాలుగా గుర్తించవచ్చు అని అమెరికన్ జర్నల్ ఆఫ్ హెమటాలజీలో ప్రచురించిన అధ్యయనంలో రాశారు. ఈ సర్వేలో పాల్గొన్న వాళ్లలో 57 శాతం మంది మహిళలు కాగా, వాళ్ల వయసు అటూఇటూగా 58 ఏళ్ల వయసు ఉంది. మొత్తం పాల్గొన్నవాళ్లలో 44 శాతం మందికి క్యాన్సర్ చరిత్ర ఉంది. క్యాన్సర్ వల్ల ఫలితాలలో మార్పు ఉండదని ఈ పరిశోధకులు వివరించారు.
టాపిక్