Foods and Depression: ఇవి తింటే మీలో డిప్రెషన్‌ మరింత పెరుగుతుందని తెలుసా?-foods that increase depression stop eating these when you are sad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Foods That Increase Depression, Stop Eating These When You Are Sad

Foods and Depression: ఇవి తింటే మీలో డిప్రెషన్‌ మరింత పెరుగుతుందని తెలుసా?

Apr 26, 2023, 04:14 PM IST HT Telugu Desk
Apr 26, 2023, 04:14 PM , IST

  • Foods and Depression: డిప్రెషన్‌ కలగడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కారణం కావచ్చు. అవి ఎలాంటి ఆహారాలో ఇక్కడ తెలుసుకోండి.

డిప్రెషన్ అనేది అనేక కారణాలతో కూడిన సంక్లిష్ట పరిస్థితి. కొన్ని రకాల ఆహారాలు డిప్రెషన్ భావాలను మరింత పెంచగలవు. అందులో కొన్ని ఇక్కడ చూడండి. 

(1 / 6)

డిప్రెషన్ అనేది అనేక కారణాలతో కూడిన సంక్లిష్ట పరిస్థితి. కొన్ని రకాల ఆహారాలు డిప్రెషన్ భావాలను మరింత పెంచగలవు. అందులో కొన్ని ఇక్కడ చూడండి. (Unsplash)

ఫాస్ట్ ఫుడ్స్:  శుద్ధి చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి  ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ మీ మానసిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. మీలో నిరాశ నిస్పృహలను పెంచుతాయి. 

(2 / 6)

ఫాస్ట్ ఫుడ్స్:  శుద్ధి చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి  ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ మీ మానసిక స్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. మీలో నిరాశ నిస్పృహలను పెంచుతాయి. (Shutterstock)

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లు: మైదాపిండితో చేసిన రోటీలు, పాస్తా వంటి ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి ఆపై మైండ్ క్రాష్‌కు కారణమవుతాయి, ఇది మానసిక కల్లోలం,  అలసట, చిరాకుకు దారితీస్తుంది. 

(3 / 6)

శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లు: మైదాపిండితో చేసిన రోటీలు, పాస్తా వంటి ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి ఆపై మైండ్ క్రాష్‌కు కారణమవుతాయి, ఇది మానసిక కల్లోలం,  అలసట, చిరాకుకు దారితీస్తుంది. (Shutterstock)

కృత్రిమ స్వీటెనర్లు: అస్పర్టమే వంటి కృత్రిమ స్వీటెనర్‌లు మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయని, డిప్రెషన్‌కు దోహదం చేస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. 

(4 / 6)

కృత్రిమ స్వీటెనర్లు: అస్పర్టమే వంటి కృత్రిమ స్వీటెనర్‌లు మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయని, డిప్రెషన్‌కు దోహదం చేస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. (Unsplash)

వేయించిన ఆహారాలు: వేయించిన ఆహారాలు సాధారణంగా అనారోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, శరీరంలో మంటకు దోహదం చేస్తాయి, ఇది డిప్రెషన్‌తో ముడిపడి ఉంటుంది. 

(5 / 6)

వేయించిన ఆహారాలు: వేయించిన ఆహారాలు సాధారణంగా అనారోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, శరీరంలో మంటకు దోహదం చేస్తాయి, ఇది డిప్రెషన్‌తో ముడిపడి ఉంటుంది. 

ఆల్కహాల్: ఆల్కహాల్ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. మద్యం సేవిస్తున్నప్పుడు ప్రారంభంలో తాత్కాలికంగా మీ మూడ్ పెంచవచ్చు కానీ, తర్వాత బాధలను గుర్తుచేస్తుంది. అంతేకాకుండా ఇది నిద్ర విధానాలకు అంతరాయం కలిగిస్తుంది. మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడంలో, మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. 

(6 / 6)

ఆల్కహాల్: ఆల్కహాల్ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. మద్యం సేవిస్తున్నప్పుడు ప్రారంభంలో తాత్కాలికంగా మీ మూడ్ పెంచవచ్చు కానీ, తర్వాత బాధలను గుర్తుచేస్తుంది. అంతేకాకుండా ఇది నిద్ర విధానాలకు అంతరాయం కలిగిస్తుంది. మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడంలో, మెదడు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు