DNA and Fruit: మన DNAను దెబ్బ తినకుండా కాపాడే శక్తి ఉన్న పండు ఇదొక్కటే, రోజుకు ఒకటి తినండి చాలు-kiwi fruit has the power to protect our dna from damage just eat one a day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dna And Fruit: మన Dnaను దెబ్బ తినకుండా కాపాడే శక్తి ఉన్న పండు ఇదొక్కటే, రోజుకు ఒకటి తినండి చాలు

DNA and Fruit: మన DNAను దెబ్బ తినకుండా కాపాడే శక్తి ఉన్న పండు ఇదొక్కటే, రోజుకు ఒకటి తినండి చాలు

Haritha Chappa HT Telugu
Jun 13, 2024 02:32 PM IST

DNA and Fruit: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే డీఎన్ఏను కాపాడుకోవాలి. డీఎన్ఏను కాపాడే శక్తి ఒకేఒక్క పండుకు నిండుగా ఉంది. ఆ పండు కివీ. వీటిని ప్రతిరోజూ తినండి.

డీఎన్ఏ కోసం ఏం తినాలి?
డీఎన్ఏ కోసం ఏం తినాలి? (Pexels)

DNA and Fruit: శరీరంలోని డిఎన్ఏ ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవించగలం. డీఎన్ఏ ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాన్ని ప్రత్యేకంగా తీసుకోవాలి. పండ్లలో కివీ పండు దీన్ని కాపాడడంలో ముందుంటుంది. డిఎన్ఎ కు ఎటువంటి నష్టం జరగకుండా రక్షించే పండుల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.

డిఎన్ఏ అంటే ఏమిటి?

డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లం. అన్ని జీవులలో ఈ డీఎన్ఏ ఉంటుంది. ఇదే శారీరక పెరుగుదల, అభివృద్ధి, అవయవాల పనితీరు, పునరుత్పత్తిలో ఉపయోగపడే జన్యువులను కలిగి ఉండే అణువు. డిఎన్ఏను దెబ్బ తినకుండా కాపాడుకోవాలి. డిఎన్ఏ డ్యామేజ్ అయితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. డీఎన్ఏ కాపాడుకోవడం కోసం రోజుకు ఒక కివీ పండును తినడం అలవాటు చేసుకోవాలి.

రోజుకు ఒక కివీ పండును తినడం వల్ల డిఎన్ఏ 60 శాతం వరకు దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు. ఈ కివి పండ్లు డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా కాపాడడమే కాదు, వాటిని మరమ్మత్తు చేస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చెబుతున్న ప్రకారం కివీ పండు తీసుకోవడం వల్ల మానవ కణాలలో డీఎన్ఏ నష్టాన్ని తగ్గిస్తాయి. కివీ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు... ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడడంలో ముందుంటాయి.

క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది

కివీ పండులో విటమిన్ సి, విటమిన్ ఈ అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఈ రెండూ డిఎన్ఏను మరమ్మతు చేసి మళ్లీ ఆరోగ్యంగా మారుస్తాయి. మనం మన డిఎన్ఏని రక్షించుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. అలాగే ఏజింగ్ ప్రక్రియ కూడా మందగిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది. కాబట్టి డిఎన్ఏ ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది.

డిఎన్ఏను కాపాడటమే కాదు, కివీ తినడం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి రోజుకో కివీ తినేవారిలో మలబద్ధకం సమస్య రాదు. కివి పండులో ఫ్లేవనాయిడ్స్, కెరటనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా ఫైటోన్యూట్రియెంట్లు. ఇవి డీఎన్ఏ పై రక్షిత పొరను ఏర్పరిచి కాపాడుతూ ఉంటాయి. అలాగే మన శరీరాన్ని యూవీ రేడియేషన్ నుండి కాపాడతాయి. కాలుష్యం వల్ల డిఎన్ఏ దెబ్బతినకుండా కాపాడడంలో ఇవి ముందుంటాయి.

కివీ పండులో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఫోలేట్‌ను విటమిన్ బి9 అని కూడా అంటారు. ఇది డీఎన్ఏ సంశ్లేషణకు మరమ్మతుకు చాలా అవసరం. తగినంత ఫోలేట్ తినడం వల్ల శరీరంలో చేరడం వల్ల జన్యువులు స్థిరంగా ఉంటాయి. క్యాన్సర్ తో సహా అనేక వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.

కివీ పండును రోజుకొక తినడం వల్ల శరీరంలో ఉన్న విషాలు, వ్యర్ధాలు బయటికి పోతాయి. శరీరంపై ఆర్సీకరణ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. దీని వలన కూడా డిఎన్ఏ దెబ్బతినకుండా ఉంటుంది. కివీలో ఉండే ఎంజైమ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. మెరుగైన జీర్ణక్రియ వల్ల పోషకాల శోషణ కూడా చక్కగా జరుగుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. దీనివల్ల డీఎన్ఏతో పాటు కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు రోజుకు ఒక కివీ పండు తినేందుకు ప్రయత్నించండి. ఒక నెల రోజుల్లో మీకే మంచి మార్పు కనిపిస్తుంది.

Whats_app_banner