Most stressful city in the world: ప్రపంచంలోని ఈ నగరాల్లోనే ఒత్తిడి ఎక్కువ, జీవించడం చాలా కష్టం, టాప్ స్థానంలో మన నగరమే
Most stressful city in the world: పర్యావరణం ఎంత ప్రశాంతంగా ఉంటే మానసికంగా అంత సంతోషంగా ఉంటారు. కానీ చుట్టూ ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటే జీవించడం కష్టంగా మారుతుంది. అలా అధిక ఒత్తిడితో కూడిన నగరాలు కొన్ని ఉన్నాయి.
Most stressful city in the world: ఒత్తిడి... పిల్లలు, పెద్దలను ఇద్దరినీ ప్రభావితం చేసే ఒక మానసిక ప్రతిస్పందన. ఇది మానసిక ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. రోజువారీ కార్యకలాపాలను కూడా ప్రశాంతంగా చేసుకోనీయకుండా అంతరాయం కలిగిస్తుంది. ఒత్తిడి కలగడానికి చుట్టూ ఉన్న పరిస్థితులు, వాతావరణం, మనుషులు, పని కారణాలుగా చెబుతారు. ఒత్తిడికి చికిత్స చేయకపోతే అది అధిక రక్త పోటుకు, గుండె జబ్బులకు, ఊబకాయం, స్ట్రోక్, మధుమేహం వంటి రోగాలకు దారితీస్తుంది.
ఒక అధ్యయనం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారితో పోలిస్తే నగరాల్లో నివసిస్తున్న వారే అధికంగా ఒత్తిడి బారిన పడుతున్నారు. వీరిలో ఆందోళన, మానసిక రుగ్మతలు అధికంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలో అధిక ఒత్తిడితో కూడిన నగరాలు కొన్ని ఉన్నాయి. వాటిలో టాప్ సిక్స్ జాబితా ఇక్కడ ఇచ్చాము. అందులో మన దేశానికి చెందిన నగరాలు కూడా రెండు ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడితో నిండిన నగరాల్లో టాప్ స్థానంలో మన దేశానికి చెందిన పట్టణమే నిలిచింది.
ముంబై
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఒత్తిడితో కూడిన నగరంగా ముంబై మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నివసించేవారు గాలి కాలుష్యంతో ఇబ్బంది పడతారు. కాంతి కూడా సగం మందికి సరిగా తగలదు. ఇది శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. ముంబైలో జనసాంద్రత చాలా ఎక్కువ. దీనివల్ల ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్య సేవలు సరైన సమయానికి అందడం కష్టం. ముంబైలో జీవితం చాలా ఒత్తిడితో కూడి ఉంటుంది. సవాల్ వాతావరణాన్ని అందిస్తుంది.
లాగోస్
ఆఫ్రికాలోని రెండో అత్యధిక జనాభా కలిగిన నగరం లాగోస్. ఇది నైజీరియాలో ఉంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువ. ఎక్కడికి వెళ్లాలన్నా గంటలు గంటలు ట్రాఫిక్ లో ఉండాల్సి వస్తుంది. నీళ్లు కూడా సరిగా దొరకవు. అద్దెకు ఇల్లు కూడా దొరకవు. నాసిరకంగా జీవన పరిస్థితుల్లో ఉంటాయి. లాగోస్‌లో జీవించడం చాలా కష్టమయం.
మనీలా
ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలా. ఈ నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ ఉంటుంది. ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురవుతారు. ఒత్తిడి బారిన పడతారు. మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా కష్టంగా ఉంటుంది. అధిక జనాభా వల్ల కాలుష్యం అధికమైంది. పారిశుధ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది.
న్యూఢిల్లీ
భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. ఈ మహానగరంలో నివసించడం సవాలుతో కూడిన ప్రయాణమే. తీవ్రమైన వాయు కాలుష్యం, తీవ్రమైన చలి, ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు... ఈ నగరంలో జీవించడాన్ని ఒత్తిడితో నింపేస్తాయి. ట్రాఫిక్ రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. ఆఫీసులకు వెళ్లేందుకు రెండు మూడు గంటలు ట్రాఫిక్ లో ఉండాల్సి వస్తుంది. న్యూఢిల్లీలో జీవించడం సవాలుతో కూడిన అంశమే.
బాగ్దాద్
బాగ్ధాద్... ప్రపంచంలోని అత్యధిక ఒత్తిడితో కూడిన నగరాల్లో ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ నిత్యం సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. గొడవలతో అక్కడ ప్రజలు అస్థిరంగా, అనిశ్చితితో నివసిస్తూ ఉంటారు. ఇదే అక్కడ ఉంటున్న ప్రజల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. లింగ సమానత్వం తక్కువే. మహిళలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వరు. మౌలిక సదుపాయాలు ఉండవు. చాలా పరిమితంగా ఉంటాయి. విద్య కూడా సగం మందికి అందదు.
కాబూల్
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం. ఇక్కడ నివసించే ప్రజలు రోజువారీ జీవితంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. ఇది వారి ఒత్తిడి స్థాయిలను తీవ్రంగా పెంచేస్తుంది. ఆర్థిక పురోగతి లేక సామాజికంగా ప్రశాంతంగా జీవించలేక... ప్రజల్లో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతూ ఉంటాయి. పేదరికం, నిరుద్యోగం వ్యాపించింది. సంఘర్షణల మధ్య జీవిస్తున్న నగరం కాబూల్.