Cashew nuts: రోజుకు నాలుగు జీడిపప్పులు తినండి చాలు, అవి చేసే మ్యాజిక్ మీకు కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది
Cashew nuts: జీడిపప్పులు తినేందుకు చాలా మంది భయపడతారు. అవి తినడం వల్ల బరువు పెరుగుతామనుకుంటారు. నిజానికి జీడిపప్పు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.
Cashew nuts: ఏ ఆహారమైన అదుపు లేకుండా తింటేనే బరువు పెరుగుతారు. జీడిపప్పులు కూడా అంతే. జీడిపప్పులను రోజుకు మూడు నాలుగు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉండదు. పైగా ఇవి బరువును తగ్గిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడతాయి. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. తద్వారా గుండెను రక్షిస్తాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటిస్ బారిన పడకుండా కాపాడతాయి. కాబట్టి రోజుకి మూడు నుంచి నాలుగు జీడిపప్పులు కచ్చితంగా తినేందుకు ప్రయత్నించండి.
జీడిపప్పులో పోషకాలు
ప్రపంచవ్యాప్తంగా జీడిపప్పులు ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. కానీ వాటిని తినేందుకు మాత్రం భయపడుతూ ఉంటారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. అలాగే అసంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి అకాల మరణం నుండి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం నుంచి తగ్గిస్తాయి.
మధుమేహం ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో జీడిపప్పులు ఒకటి. రోజూ నాలుగు జీడిపప్పులు బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే చాలు... రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీడిపప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను అడ్డుకుంటాయి. జీడిపప్పులో పాలీఫెనాల్స్, కెరటనాయిడ్లు అధికంగా ఉంటాయి.
బరువు తగ్గవచ్చు
జీడిపప్పులో క్యాలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని అధికంగా తినకుండా... కేవలం మూడు నాలుగు గింజలు తింటే చాలు. పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. అలా ఆరోగ్యంగా బరువు తగ్గించుకోవచ్చు.
స్ట్రోక్, గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే జీడిపప్పును తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. జీడిపప్పులను రోజుకు మూడు నాలుగు గింజల కన్నా అధికంగా తినక పోవడమే మంచిది. ఉప్పు, నూనె వంటివి జోడించకుండా తినాలి. వేయించిన జీడిపప్పు కంటే ఉడికించిన జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేయించిన జీడిపప్పు వల్ల అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లను నష్టపోయే అవకాశం ఉంది. రాత్రంతా జీడిపప్పును నానబెట్టి ఉదయం అయ్యాక వాటిని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. వాటిలోని పోషకాలు కూడా బయటికి పోకుండా ఉంటాయి.
టాపిక్