Vaginal Health : ఈ విషయంలో రాజీపడకండి.. ఆ విటమిన్లు కచ్చితంగా తీసుకోండి..
Vitamins for Vaginal Health : శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు ఎలా అవసరమో.. యోనిని ఆరోగ్యానికి కూడా విటమిన్లు అంతే అవసరం అంటున్నారు సెక్సాలజిస్టులు. యోని సమస్యలకు విటమిన్ల లోపం కూడా ఓ కారణమని తెలిపారు. ఇంతకీ యోనీ ఆరోగ్యానికి ఏ విటమిన్లు తీసుకోవాలో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Vitamins for Vaginal Health : జుట్టు, కళ్లు, చర్మం విషయంలో మనమందరం శ్రద్ధ వహిస్తాము. వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి.. రోజువారీ ఆహారంలో అవసరమైన విటమిన్లను చేర్చుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ మీ యోనిలో జరిగే సమస్యలకు కూడా విటమిన్ల లోపమే కారణమని మీకు తెలుసా? అవునండీ.. విటమిన్ల లేకపోవడం కూడా యోని సమస్యలకు ఓ కారణం అంటున్నారు నిపుణులు. అందుకే యోని ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీపకూడదని.. లేదంటే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న వయస్సు లేదా పేలవమైన పరిశుభ్రతతో పాటు.. విటమిన్లలోపం.. ఇతర కారణాలపై యోని ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు.
మహిళల శరీరంలోనే యోని అత్యంత సున్నితమైన ప్రాంతం. కాబట్టి దాని ఆరోగ్యం గురించి కచ్చితంగా కేర్ తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. యోని సరైన పనితీరు కోసం, ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని విటమిన్లను కచ్చితంగా డైట్లో యాడ్ చేసుకోవాలి అంటున్నారు. ఈ విటమిన్ల లోపం వల్ల యోనిలో పొడిబారడం, దురద, దుర్వాసన వంటి అనేక సమస్యలు కూడా వస్తాయని తెలిపారు. అందుకే యోని ఆరోగ్యానికి విటమిన్లు అవసరమని అంటున్నారు. అయితే యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ విటమిన్లు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ ఎ
విటమిన్ ఎ.. యోని పొడిబారకుండా తేమను అందిస్తుంది. యోని లైనింగ్ శ్లేష్మ పొరను ఏర్పరుస్తుంది. ఇది యోని పొడిబారకుండా చేసి.. తేమను అందిస్తుంది. లైనింగ్ కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. ఈ చర్యకు విటమిన్ ఎ చాలా ముఖ్యం.
విటమిన్ ఎ ఉన్న ఆహారాలలో ఉండే బీటా కెరోటిన్ సమ్మేళనం పొడిని తొలగిస్తుంది. ఆకుకూరలు, క్యారెట్, బ్రకోలీ, కాలే మొదలైన వాటిలో విటమిన్ ఎ కనిపిస్తుంది. ఇవన్నీ ఆహారంలో చేర్చినప్పటికీ.. మీకు సమస్య అనిపిస్తే.. వైద్యుడిని సంప్రదించవచ్చు. వారి సూచనలతో విటమిన్ ఎ సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.
విటమిన్ బి
విటమిన్ బి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. యోని నుంచి అనేక రకాల స్రావాలు విడుదల అవుతాయి. ఇవి కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి యోనిని కాపాడుతాయి. అయితే విటమిన్ బి లోపం వల్ల.. హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల ఈ స్రావాలు విడుదల కాక.. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ.
అందుకే ఈ ముఖ్యమైన విటమిన్‌ను కచ్చితంగా మీ డైట్లో ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా మీ ఆహారంలో చీజ్, బంగాళాదుంపలు, పౌల్ట్రీ, చేపలు మొదలైనవాటిని చేర్చుకోవాలి. వీటి వినియోగంలో సమతుల్యత ఉండాలని గుర్తుంచుకోండి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ ఇ
పెరిమెనోపాజ్ లేదా పోస్ట్ మోనోపాజ్ సమయంలో సంభవించే చాలా సమస్యలకు విటమిన్ ఇ పరిష్కారం చూపుతుంది. విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. అదే సమయంలో విటమిన్ ఇ కలిగిన సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం వల్ల రక్తస్రావం ఎక్కువ అవుతుంది. కాబట్టి దీన్ని మీ ఆహారంలో చేర్చుకునే ముందు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.
నట్స్, పండ్లు మీ విటమిన్ E అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ డి
ఎముకలను బలపరిచే ఈ విటమిన్ యోని ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. వయసైపోతున్న మహిళలు తమ ఆహారంలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకుంటే యోని పొడిబారడాన్ని నియంత్రించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆవు పాలు, గుడ్డు పచ్చసొన, ఓట్ మీల్, శాకాహారి పాలు, సాల్మన్, ఆరెంజ్ జ్యూస్ మొదలైన వాటిని తీసుకోవడం ద్వారా విటమిన్ డి అవసరాలను తీర్చుకోవచ్చు.
ఈ విటమిన్లను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల మీ యోని ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని తీసుకుంటున్నా.. పరిస్థితి మెరుగ్గా లేకపోతే.. కచ్చితంగా వైద్యులను సంప్రదించండి.
సంబంధిత కథనం