5 Vitamins You Need For Good Health : ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ విటమిన్లు తీసుకోండి-5 vitamins you need to add in your diet for good health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  5 Vitamins You Need To Add In Your Diet For Good Health

5 Vitamins You Need For Good Health : ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ విటమిన్లు తీసుకోండి

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 14, 2022 04:05 PM IST

5 Vitamins You Need For Healthy : ఈ మధ్యకాలంలో విటమిన్ల లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వీటికోసం సప్లిమెంట్స్ తీసుకుంటారు. అయితే కొన్ని ఆహారాల ద్వారా కూడా విటమిన్ల లోపాన్ని అధిగమించవచ్చు అంటున్నారు. మరి ఏ విటమిన్ల కోసం ఏమి తినొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యానికి విటమిన్లు
ఆరోగ్యానికి విటమిన్లు

5 Vitamins You Need For Healthy : దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడానికి విటమిన్లు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ విటమిన్లు అందరికీ సరైన మోతాదులో అందవు. అలాంటి వారు వైద్యుల సలహాతో సప్లిమెంట్స్ తీసుకుంటారు. అయితే కొన్ని విటమిన్ల కోసం ఆహారం కూడా తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు అవి ఏంటో.. మనకి ఆరోగ్యంగా ఉండేందుకు ఏ విటమిన్లు ఎక్కువ ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ B12

విటమిన్ B12 మీ నరాల, రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్ది.. ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసి.. ఆహారం నుంచి విటమిన్ B12 ను విడుదల చేయడానికి మీ కడుపులో తక్కువ ఆమ్లం ఉంటుంది.

50 ఏళ్లు పైబడిన వ్యక్తులు లేదా విటమిన్ బి 12 తగినంత మొత్తంలో కంటే తక్కువగా ఉండే ప్రమాదం ఉన్నవారు.. సప్లిమెంట్ తీసుకోవాలా వద్దా అనే దాని గురించి వైద్యుడిని సంప్రదించాలి. అయితే కొన్ని ఆహారాల ద్వారా విటమిన్ B12 పొందవచ్చు. అవి ఏంటంటే..

* ట్యూనా, సాల్మన్, ట్రౌట్ వంటి చేపలు.

* మాంసం.

* పౌల్ట్రీ.

* గుడ్లు.

* పాలు.

* చీజ్ లేదా నాన్‌ఫ్యాట్ ప్లెయిన్ గ్రీక్ పెరుగు వంటి పాల ఉత్పత్తులు.

* బలవర్థకమైన సోయా పాలు.

శాకాహారుల కోసం

మీ ఆహారంలో చాలా తక్కువ B12 కలిగి ఉండటం వలన మీరు మరింత ప్రమాదంలో ఉండవచ్చు అని నిపుణులు అంటున్నారు. “ఫోర్టిఫైడ్ ఫుడ్స్ B12కు మంచి వనరులు. చక్కెర పదార్థాలకు దూరంగా ఉండేలా చూసుకోండి."

ఫోలేట్, ఫోలిక్ యాసిడ్

ఫోలేట్ అనేది విటమిన్ B9కు చెందిన అనేక రకాల రూపాలను వివరించడానికి ఉపయోగించే సాధారణ పదం. విటమిన్ B9 ఎనిమిది B విటమిన్లలో ఒకటి. ఎర్ర రక్త కణాల నిర్మాణం, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదల, పనితీరుకు ఇది ముఖ్యమైనది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి.. గర్భిణీలు మొదటి మూడు వారాలలో ఫోలేట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఫోలిక్ యాసిడ్ అనేది ఫోలేట్ సింథటిక్ రూపం. దీనిని సప్లిమెంట్లలో, బలవర్థకమైన ఆహారాలలో ఉపయోగిస్తారు. వీటిని తినే ఆహారాల ద్వారా కూడా పొందవచ్చు. అవి ఏంటంటే..

* ఆకు పచ్చని కూరగాయలు.

* పండ్లు - ముఖ్యంగా సిట్రస్ పండ్లు, పుచ్చకాయలు, స్ట్రాబెర్రీలు.

* పండ్ల రసం (తక్కువ చక్కెర వేసినవి).

* ఎండిన బీన్స్

* కాయధాన్యాలు

* బఠానీలు

* చిక్కుళ్ళు.

విటమిన్ డి

ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాల కోసం అవసరమైన కాల్షియంను గ్రహించడానికి మీ శరీరానికి తగినంత విటమిన్ డి పొందడం చాలా ముఖ్యం. విటమిన్ డి లోపం కొన్ని క్యాన్సర్లు, గుండె జబ్బులు వస్తాయి. కానీ ఇతర విటమిన్ల మాదిరిగా కాకుండా.. విటమిన్ D ప్రధాన మూలం ఆహారం కాదు. సూర్యుడు.

దీనిని పొందాలంటే ఉదయపు ఎండలో ఎక్కువ ఉండాలి. నారింజ రసం, పాలు, అల్పాహార తృణధాన్యాలతో సహా మరికొన్ని సహజ వనరుల ద్వారా విటమిన్ డి తీసుకోవచ్చు.

* సాల్మన్.

* హెర్రింగ్.

* సార్డినెస్.

* పుట్టగొడుగులు.

* గుడ్లు.

మీరు చేపలు తినకుంటే లేదా ఈ ఆహారాలు మీకు అందుబాటులో లేకుంటే.. విటమిన్ డి సప్లిమెంట్ గురించి మీ వైద్యుని సలహా తీసుకోండి.

విటమిన్ B6

విటమిన్ B6 మానవ శరీరంలో దాదాపు 200 జీవరసాయన ప్రతిచర్యలలో భాగం. అయితే ఇది మీ నిద్ర, ఆకలి, మానసిక స్థితిని నియంత్రిస్తుంది. ఇది అభిజ్ఞా సామర్ధ్యాలు, రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో మీకు సహాయపడుతుంది. లోపం చాలా అరుదుగా ఉన్నప్పటికీ.. మనలో చాలామంది (ముఖ్యంగా వృద్ధులు) విటమిన్ B6 లోపంతో బాధపడతారు. మాంసాలు, తృణధాన్యాలు, కూరగాయలు, గింజల్లో B6 అధికంగా ఉంటుంది. ఇతర ఆహారా పదార్థాలు ఏమిటంటే..

* ఉడికించిన బంగాళాదుంపలు.

* అరటిపండ్లు.

* చికెన్.

విటమిన్ ఎ

విటమిన్ ఎ దృష్టి, ఆరోగ్యకరమైన చర్మం, రోగనిరోధక శక్తి కోసం చాలా ముఖ్యమైనది. ఇది ముందుగా ఏర్పడిన విటమిన్ A (రెటినోల్), బీటా-కెరోటిన్‌లలో ఉంటుంది. ఇది ఆకుపచ్చ కూరగాయలు, నారింజ లేదా పసుపు కూరగాయలు, పండ్లు బీటా-కెరోటిన్ కు మంచి వనరులు.

* క్యారెట్లు.

* చిలగడదుంపలు.

* పాలకూర.

* బ్రోకలీ.

* గుడ్లు.

* పాలు.

* వెన్న.

* చీజ్.

* కాలేయం.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్