Hair fall | జుట్టు రాలుతోందా? విటమిన్ల లోపమేమో చెక్ చేశారా?-how to reduce hair fall and effect of vitamin deficiency ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Fall | జుట్టు రాలుతోందా? విటమిన్ల లోపమేమో చెక్ చేశారా?

Hair fall | జుట్టు రాలుతోందా? విటమిన్ల లోపమేమో చెక్ చేశారా?

Praveen Kumar Lenkala HT Telugu
Feb 23, 2022 04:40 PM IST

Hair fall | జుట్టు రాలుతుండడం కొందరికి మానసిక వ్యథను మిగులుస్తుంది. ఇందుకోసం చాలా హోమ్ రెమెడీస్ వాడి వాడి విసుగుచెందుతారు. చుండ్రు, వెంట్రుకలు రాలిపోవడం, వెంట్రుకలు పెరగకపోవడం వంటి సమస్యలకు మూలాలు వెతికితే పరిష్కారం సులువవుతుంది. ప్రధానంగా విటమిన్ల లోపం ఈ సమస్యకు కారణంగా నిలుస్తోంది.

జుట్టు రాలిపోతోందా?
జుట్టు రాలిపోతోందా? (pixabay)

తల వెంట్రుకలు రాలిపోవడం, చుండ్రు, జుట్టు పెరగకపోవడం వంటి సమస్యలకు చర్మ వైద్య నిపుణులు సరైన చికిత్సను అందిస్తారు. హోమ్ రెమెడీస్‌తో ఉపశమనం లభించనప్పుడు వెంటనే చర్మ వ్యాధి నిపుణులను సంప్రదించాలి.

చర్మ వ్యాధి నిపుణులు ముందుగా మీకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అవన్నీ రక్త పరీక్షలే. ముఖ్యంగా హిమోగ్లోబిన్, విటమిన్ డి, విటమిన్ బీ 12, సీబీసీ, థైరాయిడ్, ఎస్.ఫెరిటిన్ తదితర పరీక్షలు నిర్వహిస్తారు.

ఆయా విటమిన్ల లోపాలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన మందులు ఇస్తారు. ముఖ్యంగా గామా-లైనోలెనిక్ యాసిడ్, మల్టీ విటమిన్ టాబ్లెట్లు రాస్తారు. గామా-లైనోలెనిక్ యాసిడ్ జుట్టు రాలకుండా ఉండేందుకు దోహదపడే ఫాటీ యాసిడ్. అలాగే ఇది జుట్టు పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది. విటమిన్ డీ లోపం ఉంటే దానికి తగిన టాబ్లెట్లు ఇస్తారు. ఐరన్ లోపం ఉంటే అందుకు తగిన టాబ్లెట్ ఇస్తారు.

తలకు నూనె రాయొద్దు..

అలాగే తలకు నూనె రాయొద్దని వైద్యులు హెచ్చరిస్తారు. రెండు రోజులకు ఒకసారి షాంపూతో తల స్నానం చేయాలని వైద్యులు సూచిస్తారు. మీ జుట్టుకు తగిన షాంపూను కూడా వారే సూచిస్తారు. రొటీన్‌గా యూజ్ చేసేందుకు సెబోవాష్, స్కాల్ప్ ప్లస్ వంటి షాంపూలు రాస్తారు.

కాస్త ఖరీదు ఎక్కువగా ఉండే సీరం కూడా రాస్తారు. మీ జుట్టు ఊడిపోవడాన్ని ఆపి, ఇతర సమస్యలకు చెక్ పెట్టేందుకు సీరమ్ దోహదం చేస్తుంది. ట్రైఫోలియం ప్రటెన్స్, ఎసిటైల్ టెట్రాపెప్టైడ్-3, బయోటిన్, పెంథనాల్, లాక్టిన్ యాసిడ్, ప్రొపైలీన్ గ్లైకోల్ వంటి ఔషధాలతో కూడిన సీరమ్ మీ జుట్లు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. వైద్యుల సూచనల మేరకు రోజూ రెండు పూటల ఈ సీరమ్ తలకు వాడాల్సి ఉంటుంది.

వైద్యులు చెప్పినట్టుగా తలకు నూనె రాయకుండా మీరు దినం తప్పించి దినం తగిన షాంపూతో స్నానం చేసి వారు సూచించిన మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, సీరం వాడితే మీ జుట్టు కొత్త రూపు సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సమతుల ఆహారం

మన శరీరంలో విటమిన్లు, మినరల్స్ లోపం విభిన్న వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల సమతుల ఆహారంతో సంపూర్ణ పోషకాలు అందేలా చూసుకుంటే జుట్టు సమస్యలే కాకుండా, ఇతర అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఒత్తిడిని మేనేజ్ చేసేలా తగిన వ్యాయామాలు, యోగ, ధ్యానం వంటివి ఆచరిస్తే సంపూర్ణ ఆరోగ్యానికి దగ్గరవుతారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్