Pen and Banana Trick : పెన్నుతో అరటిపండ్లను ఎక్కువ రోజులు నిల్వచేయడం ఎలా?
Banana Storage Tips : పెన్నుతో అరటిపండును ఎక్కువ రోజులు పాడవకుండా కాపాడుకోవచ్చు. చాలా సింపుల్ ట్రిక్ ఇది. ఎలాగో నేర్చుకుందాం..
మనం పెన్ను రాయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. అయితే ఈ పెన్నును వివిధ రకాలుగా కూడా ఉపయోగించవచ్చు. కొన్నింటిని పాడవకుండా కూడా కాపాడుకోవచ్చు. అవును ఇది నిజం.. మనం దీన్ని రాసేందుకు మాత్రమే కాదు.. అరటిపండు చెడిపోకుండా కూడా వాడుకోవచ్చు. ఇది వినడానికి మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ నిజం. ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది.
పెన్ను, అరటిపండు ఒకదానికొకటి సంబంధం లేదని మనందరికీ తెలుసు. కానీ ఈ రెండూ కలిపి వాడితే అరటిపండు త్వరగా పాడవదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.. వర్కౌట్ అవుతుంది.. మళ్లీ మళ్లీ ఇదే ట్రిక్ ఫాలో అవుతారు. పెన్నుతో అరటిపండును ఎక్కువ రోజులు ఎలా నిల్వచేయాలో చూద్దాం..
మొదట అరటిపండ్లను తీసుకోవాలి. తర్వాత పెన్ను తీసుకుని రెండు అరటిపళ్ల మధ్య పెట్టాలి. అంటే రెండు అరటిపండ్లు కలిపి ఉండాలి. ఇప్పుడు ఈ అరటిపండ్ల మధ్య ఉండే భాగంలో పెన్ను పెట్టాలి. తర్వాత దానికి దారం కట్టి మీ ఇంట్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు. ఇలా చేస్తే ఏం ప్రయోజనం అని మీరు ఆలోచించవచ్చు. కానీ ఉపయోగం ఉంది.
మీరు స్టోర్ నుండి కొనుగోలు చేసిన మొదటి రోజు అరటిపండ్లు బాగానే ఉంటాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ పాడవడం మొదలవుతుంది. తినలేని స్థితికి వెళ్తుంది. దీంతో బయట పారేయాల్సి వస్తుంది. మనం అరటిపండ్లను కొనుగోలు చేసి వాటిని పక్కన పెట్టినప్పుడు, వాటిపై ఒత్తిడి ఏర్పడుతుంది. కింద ఉన్న అరటిపండ్లు పాడవుతాయి. ముందుగా అరటిపండు పెట్టే పద్ధతిని మార్చుకోండి. అరటిపండును పెన్ను సహాయంతో వేలాడదీయండి. వాటిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. త్వరగా చెడిపోదు.
అరటిపండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువ కాలం భద్రపరచడం కష్టం. త్వరగా పండుతుంది. చిన్న అరటిపండ్లు త్వరగా కుళ్లిపోతాయి. ఎక్కడైనా పెడితే కింది భాగం పాడవుతుంది. అరటిపండ్లు ఎక్కువసేపు ఉంచితే నల్లగా మారుతాయి. అరటిపండ్లు నల్లగా మారకుండా ఉండేందుకు చిట్కాలు పాటించాలి.
అరటిపండు నల్లగా మారకుండా ఉండేందుకు తీగతో వేలాడదీయాలి. ఇలా వేలాడదీస్తే త్వరగా పాడవవు. అంతే కాకుండా అరటిపండు నల్లగా మారకుండా ప్లాస్టిక్ సంచిలో చుట్టి ఉంచవచ్చు. అరటిపండ్లు తాజాగా ఉండాలంటే ఒక గిన్నెలో వెనిగర్ వేసి అందులో అరటిపండ్లు వేసి విడిగా వేలాడదీయాలి. త్వరగా చెడిపోదు. ఇంట్లో అరటిపండ్లను పాడవకుండా చూసేందుకు ఈ చిట్కాలను ఉపయోగించండి. పైన చెప్పిన చిట్కాలను పాటిస్తే అరటిపండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ ఒక అరటిపండు తినండి.
అరటిపండును దాదాపు అందరూ ఇష్టపడుతారు. మంచి రుచిని ఇస్తాయి. దీన్ని తినడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది. అరటిపండులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అనేక వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. అరటిపండులో ఐరన్, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు దొరుకుతాయి. రోజూ అరటిపండు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అరటిపండు జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి బయటపడటానికి ఉపయోగపడుతుంది.