world largest ink pen in himachal pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ అట్రీ అతిపెద్ద ఇంక్ పెన్ను తయారు చేశారు. 20 అడుగుల పొడవు, 43 కిలోల బరువు గల ఈ పెన్ను ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇందులో రికార్డరుతోపాటు సీసీటీవీ కెమెరాను కూడా అమర్చారు. శనివారం ఈ పెన్నును ప్రారంభించిన సంజీవ్... పాఠశాలలోని విద్యార్థులందరికీ దీనిని అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో సౌండ్ సెన్సార్ ఉన్నందున ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా పాఠాన్ని రికార్డు చేసి మొబైల్ నుంచి పంపితే చాలు.. అదే బోధిస్తుంది. పెన్నులో అమర్చిన సీసీ కెమెరా పాఠశాల భద్రతకు ఎంతో ఉపయోగకరం.సౌరశక్తితో చార్జ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ వీడియోనూ మీరు కూడా చూసి షేర్ చేయండి……