Pot Water Drinking : వేసవిలో కుండ నీరు.. తాగితే ఎన్నో ప్రయోజనాలు-here are drinking pot water health benefits in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Here Are Drinking Pot Water Health Benefits In Summer

Pot Water Drinking : వేసవిలో కుండ నీరు.. తాగితే ఎన్నో ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu
Feb 28, 2023 02:09 PM IST

Pot Water Drinking Benefits : రిఫ్రిజరేటర్లు, ఆక్వాగార్డులు వచ్చాయి. దీంతో మట్టి కుండలో నీరు తాగడం తగ్గిపోయింది. కానీ పూర్వం మట్టిపాత్రల్లో నీళ్లు తాగి.. ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కుండలో నీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. వేసవిలో మరింత ఉంటాయి.

కుండ నీరు
కుండ నీరు (unsplash)

Pot Water Benefits : వేసవి కాలం వచ్చేసింది. చల్లగా నీరు తాగాలి అనిపిస్తుంది. ఇందుకోసం ఫ్రిజ్ వైపూ చూస్తారు చాలామంది. అయితే ఇలా ఫ్రిజ్ నీటిని తాగడం మాత్రం మంచిది కాదు. కూల్ గా ఉంది కదా అని.. తాగుతూ ఉంటారు. దీనివలన అనేక సమస్యలు వస్తాయి. ఫ్రిజ్ నీరు(fridge Water) చల్లగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి హానికరం. ఈ కారణంగా మీ జీవక్రియ మెటబాలిజం, అలాగే గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

చల్లటి నీరు(Cool Water) తాగాలి అనుకుంటే.. కుండ నీరు(Pot Water) చాలా బెస్ట్. ఆయుర్వేదంలోనూ కూడా కుండ నీరు మంచిదని చెబుతారు. మీ శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మట్టికుండలు నేచురల్ వాటర్ ప్యూరిఫైయర్లు, నీటిలో ఏవైనా హానికరమైన లోహాలు లేదా రసాయనాలు ఉంటే, అవి మట్టి కుండలో కలిసిపోతాయి. ఫలితంగా నీరు స్వచ్ఛంగా మారుతుంది. మరే ఇతర పదార్థాలతో తయారు చేసిన కంటైనర్లలో ఈ నాణ్యత కనిపించదు.

కుండ నీరు సహజంగానే చల్లగా ఉంటుంది. తాగేందుకు రుచిగా కూడా ఉంటుంది. ఫ్రిజ్ నీటి(fridge Water) కంటే ఎక్కువ పరిమాణంలో వీటిని తాగొచ్చు. వేసవి(Summer)లో కుండ నీరు మీ శరీరాన్ని చల్లబరుస్తుంది. కుండ నీళ్లతో చాలా మినరల్స్ మీ శరీరంలోకి వెళ్తాయి. ఎండాకాలంలో ఫ్రిజ్ లోని నీళ్లు తాగితే.. గొంతు నొప్పిగా ఉంటుంది. కుండ నీరు మీ శరీరాన్ని చల్లగా చేస్తుంది. పెరిగిన ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఎండ నుంచి రాగానే నీళ్లు తాగొద్దు.

వేసవిలో గ్యాస్, అసిడిటీ సమస్య బాగా పెరుగుతుంది. కుండ నీరు మీమ్మల్ని అలాంటి వాటి నుంచి విముక్తి చేస్తుంది. ఎండాకాలంలో రోజూ కుండ నీటిని తాగితే.. పొట్ట సమస్యల(Stomach Problems) నుంచి ఉపశమనం పొందొచ్చు. సమ్మర్ అనగానే చర్మ సమస్యలు(Skin Problems) మెుదలవుతాయి. చర్మం జిగటగా మారుతుంది. దీంతో మెుటిమలు కూడా పెరుగుతాయి. కుండ నీతు తాగితే.. మీ సమస్యలు తగ్గుతాయి.

మట్టి కుండ నీటిని బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఉంచుతుంది. ఈ నీరు తాగితే శ్వాసకోశ సమస్యలు నివారించవచ్చు. మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ప్రయోజనకరమైన ఖనిజాలు చేరతాయి. ఆ నీటిని తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి పెరుగుతుంది. ఇది డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

WhatsApp channel