Watermelon In Fridge : ఫ్రిజ్​లో పుచ్చకాయ పెడుతున్నారా? అయితే నో యూజ్-watermelon shouldn t be stored in fridge here s why ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Watermelon Shouldn't Be Stored In Fridge Here's Why

Watermelon In Fridge : ఫ్రిజ్​లో పుచ్చకాయ పెడుతున్నారా? అయితే నో యూజ్

HT Telugu Desk HT Telugu
Feb 19, 2023 01:51 PM IST

Watermelon : సమ్మర్ దగ్గరపడింది. ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. ఎండాకాలం రాగానే.. ప్రతిదీ ఫ్రిజ్​లో పెట్టడం అలవాటు. అలా చల్లగా కడుపులోకి వెళితే.. ఏదో తృప్తి. కానీ పుచ్చకాయను ఫ్రిజ్​లో పెడితే మంచిదేనా?

పుచ్చకాయ
పుచ్చకాయ

సమ్మర్ వచ్చిందంటే.. ప్రతి ఇంట్లో పుచ్చకాయ(Watermelon) ఉంటుంది. చల్లబరిచే బెస్ట్ ఆప్షన్లలో ఇది ఒకటి. ఎర్రగా నోరూరిస్తూ.. తినేలా చేస్తుంది. అయితే కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్ లో పెట్టినట్టుగా.. పుచ్చకాయను పెట్టవచ్చా అనే అనుమానం చాలాసార్లు వచ్చి ఉంటుంది. నిజంగానే పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టడం సరైనదేనా?

వేసవి(Summer)లో తీపి, జ్యూసీ పుచ్చకాయలను తినడం ఆరోగ్యం. ఇది సూపర్ హైడ్రేటింగ్, కొద్ది సమయంలోనే మనల్ని చల్లబరుస్తుంది. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. పుచ్చకాయ అమైనో ఆమ్లం సిట్రులైన్, రక్తపోటును నియంత్రించే మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది శరీరం(Body)లోని డిటాక్స్, మంటతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. అయితే దీనిని రిఫ్రిజిరేటర్‌(refrigerator)లో నిల్వ ఉంచడం మాత్రం మంచిది కాదని అంటున్నారు నిపుణులు. అలా చేస్తే.. దాని పోషకాలు ఉండవు.

పుచ్చకాయలను నిల్వ చేయడం అనేది ప్రతిచోటా చాలా సాధారణ పద్ధతి. వేసవి రోజులలో పుచ్చకాయలు తింటే ఆ తృప్తే వేరు. అయితే చల్లగా ఉండాలని, ఫ్రిజ్ లో పెడితే.. దాని పోషక విలువ తగ్గుతుంది. అమెరికా(America)లోని వ్యవసాయ విభాగం (USDA) అధ్యయనంలో తెలిసింది. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ఇది ప్రచురితమైంది. గదిలో సాధారణంగా పెట్టే.. పుచ్చకాయలతో పోలిస్తే.. ఫ్రిజ్ లో పెట్టిన పుచ్చకాయల పోషకాలు తక్కువగా ఉంటాయి.

పరిశోధకులు 14 రోజుల పాటు అనేక రకాల పుచ్చకాయలను పరీక్షించారు. వారు ఈ పుచ్చకాయలను ఫ్రిజ్ లో నిల్వ చేశారు. సాధారణంగా గదిలో ఉన్నవాటిలోనే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. పుచ్చకాయ(Watermelon)ను తీసుకున్న తర్వాత కూడా కొన్ని పోషకాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుందని వారు వివరిస్తున్నారు. పండ్ల(Fruits)ను శీతలీకరించడం వల్ల మొత్తం ప్రక్రియ మందగిస్తుంది లేదా ఆగిపోతుంది. రిఫ్రిజిరేటెడ్ ఉష్ణోగ్రత వద్ద అవి ఒక వారంలో కుళ్ళిపోవచ్చు.(పుచ్చకాయ సాధారణంగా 14 నుండి 21 రోజులు వరకు ఉంటుంది). పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటే పుచ్చకాయ ప్రయోజనాలను పొందాలంటే.. గది ఉష్ణోగ్రతలో ఉంచాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్