Coconut Water Health Benefits : వేసవి కంటే చలికాలంలోనే కొబ్బరి నీళ్లతో ప్రయోజనాలు ఎక్కువ..-health benefits of drinking coconut water in winter here is the benefits ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Coconut Water Health Benefits : వేసవి కంటే చలికాలంలోనే కొబ్బరి నీళ్లతో ప్రయోజనాలు ఎక్కువ..

Coconut Water Health Benefits : వేసవి కంటే చలికాలంలోనే కొబ్బరి నీళ్లతో ప్రయోజనాలు ఎక్కువ..

Jan 12, 2023, 08:09 AM IST Geddam Vijaya Madhuri
Jan 12, 2023, 08:09 AM , IST

  • Coconut Water Health Benefits : చాలామంది వేసవికాలంలో ఎక్కువగా కొబ్బరి నీరు తీసుకుంటారు. చలికాలంలో ఎక్కువ తాగితే జలుబు చేస్తుందేమోనని ఆలోచిస్తారు. అయితే చలికాలంలో కొబ్బరినీరు తీసుకుంటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

సాధారణంగా వేసవిలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటారు. కానీ చలికాలంలో ఈ నీరు తాగడం వల్ల కొన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 7)

శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకునేవారు కచ్చితంగా కొబ్బరి నీరు తీసుకోవచ్చు. ఇందులోని రిబోఫ్లావిన్, నియాసిన్, థయామిన్, పిరిడాక్సిన్ వంటి ప్రయోజనకరమైన పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి సూక్ష్మక్రిములు సులభంగా ఇన్‌ఫెక్షన్‌ను కలిగించవు.

(2 / 7)

చలికాలంలో తెలియకుండానే ఎక్కువగా తినేస్తాము. వ్యాయామం చేయడం తగ్గిస్తాము. దీనివల్ల బరువు పెరుగుతారు. అయితే చలికాలంలో బరువు తగ్గాలనుకునేవారికి కొబ్బరి నీరు కచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఇది జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దానికోసం అనేక ప్రయోజనకరమైన ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. కాబట్టి ఆహారం బాగా జీర్ణమవుతుంది. కాబట్టి జీర్ణం కాని ఆహారం శరీరంలో కొవ్వుగా పేరుకుపోనివ్వదు. ఫలితంగా బరువు తగ్గడం మొదలవుతుంది.

(3 / 7)

చలికాలంలో చర్మం పొడిబారుతుంది. కొబ్బరి నీరు చలికాలంలో కూడా చర్మం తేమ, తాజాదనాన్ని నిలుపుకోవడంలో మీకు సహాయపడుతుంది. దీనిలో సైటోకినేస్ అనే యాంటీ ఏజింగ్ పదార్ధం ఉంది. ఇది వృద్ధాప్య సంకేతాలను నిరోధిస్తుంది.

(4 / 7)

మినరల్ లవణాలు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా కొబ్బరి నీళ్లలో మంచి స్థాయిలో ఉంటాయి. ఈ ఖనిజ లవణాలు దంతాల ప్రకాశాన్ని పెంచుతాయి. చిగుళ్లను బలపరుస్తాయి. చాలామందికి చిగుళ్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. చిగుళ్లు ముదురు ఎరుపు రంగులోకి మారుతాయి. కొబ్బరి నీటితో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

(5 / 7)

చలికాలంలో మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే కొబ్బరిలో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేయడంతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే మెగ్నీషియం కూడా చాలా రకాలుగా సహాయపడుతుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

(6 / 7)

చలికాలంలో చాలామంది తక్కువ నీరు తీసుకుంటారు. దీని వల్ల హానికరమైన టాక్సిక్ ఎలిమెంట్స్​ను తొలగించడం శరీరానికి కష్టమవుతుంది. అయితే కొబ్బరి నీరు శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపడంలో కచ్చితంగా సహాయం చేస్తుంది. అందుకే ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగితే టాక్సిన్లతో పాటు.. రకరకాల వ్యాధులు దూరమవుతాయి.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు