Gold Pot Fraud : ఈ మట్టికుండ నెల రోజుల్లో బంగారమవును-man cheats in the name of treasure in nirmal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Man Cheats In The Name Of Treasure In Nirmal

Gold Pot Fraud : ఈ మట్టికుండ నెల రోజుల్లో బంగారమవును

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 02:34 PM IST

Cheating In Telangana : ఒక మనిషి నమ్మకమే.. మరో మనిషికి పెట్టుబడి. దీన్నే ఫాలో అయి కొంతమంది తప్పుదారుల్లో వెళ్తున్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులు కాజేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మనిషిని నమ్మిస్తే.. చాలు లక్షల్లో డబ్బులు లాగేయోచ్చు.. నేను చేసే పూజలతో మీకు డబ్బులే డబ్బులు.. అని అమాయకులకు చెప్పి.. కొంతమంది ఇప్పటికీ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ ఘనుడు ఇలానే ఓ వ్యక్తిని నమ్మించాడు. మట్టికుండ బంగారమవుతుందని(Gold) చెప్పాడు. బాధితుడు మోసపోయానని తెలుసుకున్నాడు. కానీ మోసం చేసిన వ్యక్తే.. బాధితుడిని ఇరికించాలనుకున్నాడు.

నిర్మల్‌(Nirmal) డీఎస్పీ జీవన్‌రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దుస్తురాబాద్ మండలంలోని ఆకొండపేట గ్రామానికి చెందిన జాడి బుచ్చన్నతో అదే గ్రామానికి చెందిన మావుకారి రాజేశ్ కు పరిచయం ఉంది. ఏప్రిల్ 29న జాడి బుచ్చన్న ఒక మూటలో మట్టి కుండ(Pot)ను పెట్టి.. రాజేశ్ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఓ మూలన పాతిపెట్టాడు. నెల రోజుల వరకు దానిని ఎవరు ముట్టుకోవద్దని చెప్పాడు. తానే వచ్చి స్వయంగా తీస్తానని, అది బంగారమవుతుందని బుచ్చన్న మాట ఇచ్చాడు.

అయితే మట్టికుండ బంగారు కుండగా(Gold Pot) మారాలి అంటే మాత్రం.. రూ.2.50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి వసూలు చేశాడు. ఎలాగైతేనేం బంగారం వస్తే.. ఇంతకంటే ఎక్కువే వస్తుందని కదా అని రాజేశ్ డబ్బులు ఇచ్చేశాడు. రోజులు గడుస్తున్నాయి.. బంగారమైందా అని రాజేశ్ కు ఒకటే ఆశ. నెల రోజుల తర్వాత బుచ్చన్న దగ్గరకు వెళ్లి కుండను తీయాలని అడిగాడు. తీస్తా అంటూ.. ఆరు నెలలు చేశాడు. సరే కుండ తీయకున్నా.. తాను ఇచ్చిన డబ్బులు(Money) తిరిగి ఇవ్వాలని రాజేశ్ ఒత్తిడి పెంచాడు. ఈ విషయం గ్రామ పెద్దల వరకూ వెళ్లింది.

బుచ్చన్నను గ్రామ పంచాయతీకి(Grama Panchayath) పిలిపించారు. ఈ నెల 11వ తేదీన మాట్లాడుకుందామని చెప్పి.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఊర్లో పెద్దలు పంచాయితీ చేశారు. ఎలాగైనా డబ్బులు కట్టిస్తారని బుచ్చన్న ఓ పథకం వేశాడు. నవంబర్ 10వ తేదీన గ్రామ సమీపంలోని అడవి(Forest)లో శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి దుప్పిని చంపేశాడు. దాని మంసాన్ని తీసుకెళ్లి.. రాజేశ్ పంట చేనులో ఉంచాడు. తర్వాతి రోజు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లకు ఫోన్ చేసి.. ఇలా రాజేశ్ పంటచేనులో వేట మాంసం ఉందని ఫిర్యాదు చేశాడు.

రాజేశ్ మీద అటవీశాఖ అధికారులతో కేసు నమోదు చేయించాలని బుచ్చన్న కోరాడు. దీనికోసం రూ.10 వేలు ఇవ్వనున్నట్టుగా చెప్పాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ అటవీశాఖ అధికారి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకుని.. మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. యజమాని రాజేష్, కౌలుదారుడు కుక్కరికారి లక్ష్మయ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇక్కడ వరకూ బుచ్చన్న అనుకున్నట్టుగానే జరిగింది. ఇక్కడే ఊరిపెద్దలు ఎంటర్ అయ్యారు.

ఆకొండపేట గ్రామపెద్దలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రాజేశ్ కు మట్టి కుండ ఇచ్చి.. బంగారు కుండ చేస్తానని చేసిన మోసం గురించి పోలీసులకు తెలిపారు. గుప్త నిధుల పేరుతో బుచ్చన్న చేసిన మోసంపై ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న బుచ్చన్న, దుప్పిని వేటాడేందుకు సహకరించిన శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. హెడ్‌కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

IPL_Entry_Point