ఎండాకాలంలో కిడ్నీలో రాళ్లు ఎందుకు పెరుగుతాయి.. ఎలా నివారించాలో తెలుసుకోండి..! -what causes kidney stones steps for preventing kidney stones ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  What Causes Kidney Stones Steps For Preventing Kidney Stones

ఎండాకాలంలో కిడ్నీలో రాళ్లు ఎందుకు పెరుగుతాయి.. ఎలా నివారించాలో తెలుసుకోండి..!

HT Telugu Desk HT Telugu
May 28, 2022 06:40 PM IST

వేసవిలో కిడ్నీ రోగులు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో కిడ్నీ సంరక్షణ చాలా ముఖ్యం. శరీరంలోని వ్యర్ధాలను తొలగించడంలో కిడ్నీలు శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి.

Kidneys
Kidneys

వేసవిలో శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల శరీరంలో నీరు తగ్గుతుంది, అలాగే అనేక వ్యాధులను కారణమవుతుంది. ముఖ్యంగా వేసవిలో కిడ్నీ రోగులు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో కిడ్నీ సంరక్షణ చాలా ముఖ్యం. శరీరంలోని వ్యర్ధాలను తొలగించడంలో కిడ్నీలు శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో ఒకటి.

కిడ్నీలు ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది, అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వేసవి కాలంలో కిడ్నీ స్టోన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో తీవ్రమైన వేడి ప్రభావం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుందో, దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం.

వేసవిలో కిడ్నీ స్టోన్‌కు కారణాలు: వేసవిలో కిడ్నీ స్టోన్‌కు అతి పెద్ద కారణం ఉష్ణోగ్రత పెరగడం. ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. డీహైడ్రేషన్ ప్రభావం మూత్రపిండాలపై కూడా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో కిడ్నీపై హానికరమైన ప్రభావం చూపే శీతల పానీయాలను ఎక్కువగా తీసుకుంటాం. ఇది కూడా స్టోన్స్‌కు కారణమవుతుంది. శరీరంలో నిరంతరం డీహైడ్రేషన్ సమస్య కారణంగా, కిడ్నీలో చిన్న స్ఫటికాలు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి.

ఎక్కువ నీరు త్రాగాలి: వేసవిలో ఎక్కువ నీరు త్రాగాలి. తక్కువ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి జ్యూస్ తీసుకోండి: మీరు కిడ్నీ స్టోన్‌ను నివారించాలనుకుంటే, జ్యూస్ తీసుకోండి. సీజనల్ పండ్లు ,కూరగాయల రసం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే కిడ్నీలో రాళ్ల నుండి కాపాడుతుంది.

పైనాపిల్ తినండి: వేసవిలో పైనాపిల్ తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా.. పైనాపిల్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. జీర్ణక్రియ కూడా బాగుంటుంది. పీచు పుష్కలంగా ఉండే పైనాపిల్ కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎండాకాలంలో కిడ్నీలో రాళ్లు ఎందుకు పెరుగుతాయి.. ఎలా నివారించాలో తెలుసుకోండి

వేసవిలో కిడ్నీలో రాళ్లకు ఎక్కువ ప్రమాదం మూత్రపిండాల్లో రాళ్లను నివారించడం గురించి తెలుసు

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్