Sesame With Jaggery : బెల్లంతో నువ్వులు కలిపి తింటే చాలా ప్రయోజనాలు-health benefits of eating sesame with jaggery as per ayurveda during makara sankranthi 2024 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sesame With Jaggery : బెల్లంతో నువ్వులు కలిపి తింటే చాలా ప్రయోజనాలు

Sesame With Jaggery : బెల్లంతో నువ్వులు కలిపి తింటే చాలా ప్రయోజనాలు

Anand Sai HT Telugu
Jan 09, 2024 12:00 PM IST

Sesame With Jaggery : మకర సంక్రాంతి పండుగ సమయంలో నువ్వులు, బెల్లం చాలా ముఖ్యమైనవి. వాటిని తిని మధురంగా మాట్లాడు అని చెబుతారు పెద్దలు. నువ్వులు, బెల్లం తినడం వెనక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

బెల్లం, నువ్వుల ఉపయోగాలు
బెల్లం, నువ్వుల ఉపయోగాలు (unsplash)

మకర సంక్రాంతి నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ చలికాలంలో ఈ కాలానికి తగిన ఆహారం తీసుకుంటే మంచిది. అలాంటి ఆహారాల్లో నువ్వులు, బెల్లం కూడా తప్పనిసరి. నువ్వులు శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. బెల్లం యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నువ్వులలోని ప్రొటీన్ దెబ్బతిన్న కండరాలను బాగు చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో రక్తం గడ్డకట్టడం, గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు నువ్వులను తింటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

నువ్వులను ఆయుర్వేద చికిత్సలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనె అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి వాడుతారు. నువ్వుల నూనె నుండి అనేక ఆయుర్వేద మందులు కూడా చేస్తారు. ఈ నూనె శరీరాన్ని సంరక్షిస్తుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది. నువ్వుల నూనెను ఉపయోగించడం వల్ల వాత, పిత్త దోషాలను నివారించవచ్చు. ఇది చర్మాన్ని స్మూత్‌గా, మెరిసేలా చేస్తుంది.

నువ్వులను బెల్లంతో కలిపి తింటే శరీర ఉష్ణోగ్రత పెరిగి శరీరానికి శక్తి అందుతుంది. ఏదైనా వేడి చేయడానికి ఇంధనం అవసరం. బెల్లం శరీరంలో ఇంధనంగా పనిచేస్తుంది. బెల్లం తీసుకోవడం కారణంగా నువ్వులను శక్తిగా మార్చి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇప్పుడు అన్ని ఆహారాలు రెడీమేడ్‌గా అందుబాటులో ఉన్నాయి. నువ్వులు-బెల్లం కూడా మార్కెట్‌లో దొరుకుతుంది. అవి కృత్రిమ రంగులతో కూడిన చక్కెర కూడా కలిగి ఉంటాయి. అవి ఆరోగ్యంగా ఉండవు. సంక్రాంతి సమయంలో నువ్వుల బెల్లం తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నువ్వులు, బెల్లం కలిపి ఉండలుగా చేసుకుని తినాలి. ప్రతిరోజు ఒకటి తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్, కాల్షియం లభిస్తుంది. చదువుకునే పిల్లలకు వీటిని పెడితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చాలా మందికి విటమిన్ బి, ఐరన్ లోపం కారణంతో జుట్టు ఊడిపోతుంది, తెల్లబడుతుంది. జుట్టు సంరక్షణకు కూడా బెల్లంతో నువ్వులు కలిపి తీసుకోవడం మంచిది. ఇందులోని విటమిన్ ఈ చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నువ్వు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.