Indian Hair Mask : అమ్మమ్మలు చెప్పిన హెయిర్ మాస్క్.. ఒక్కసారి ట్రై చేయండి.. జుట్టు పెరుగుతుంది
Hair Mask In Telugu : జుట్టు పెరగాలని అందరూ అనుకుంటారు. కానీ రియాలిటీలో మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంత ట్రై చేసినా పెరగదు. ఇందుకోసం అమ్మమ్మలు చెప్పిన సూపర్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
జుట్టు సమస్యను చాలా మంది ఎదుర్కొంటారు. వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోవడం, తెల్లబడటం, చుండ్రు.. అబ్బో ఇలా చెబుతూ పోతే జుట్టుకు సంబంధించిన సమస్యలు అనేకం. వీటి కోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులపై దండయాత్ర చేస్తాం. కానీ మన హెయిర్స్‌కు మాత్రం ఏవీ సెట్ కావు. మళ్లీ ఆయుర్వేదం వైపు వెళ్తాం. ఇలా రకరకాల ఉత్పత్తులు వాడి జుట్టును మెుత్తం పాడుచేస్తాం. ఇవన్నీ కాదు.. మన అమ్మమ్మలు చెప్పిన సూపర్ చిట్కాలు పాటిస్తే జుట్టు పెరుగుతుంది.
జుట్టు ఆరోగ్యం అనేక సవాళ్లను కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు రహస్యం అమ్మమ్మలు చెప్పిన మాటల్లో ఉంది. ఈ రోజుల్లో చాలా మందికి ఈ విషయం తెలియదన్నది నిజం. ఆరోగ్యకరమైన జుట్టు కోసం మనం చేయగలిగే కొన్ని విషయాలు ఉన్నాయి. జుట్టు ఆరోగ్యానికి సహాయపడే అనేక టెక్నిక్‌లు మన ముందు తరం నుండి అందించబడుతున్నాయి. కానీ మనమే పెద్దగా పట్టించుకోం.
హెయిర్ మాస్క్‌లు
జుట్టు ఆరోగ్యం కోసం అమ్మమ్మలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న కొన్ని హెయిర్ మాస్క్‌లు ఉన్నాయి. అవి ఏంటో, జుట్టు ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయో చూద్దాం. సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం వల్ల ఇది జుట్టుకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించదు. జుట్టుకు మనం కోరుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.
ఉసిరి, మందారం, పెరుగు
జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడానికి హెయిర్ మాస్క్‌లను తరచుగా ఉపయోగిస్తారు. ఈ హెయిర్ మాస్క్‌లు హానికరమైన పరిస్థితుల నుండి జుట్టును రక్షించడంలో సహాయపడతాయి. ఉసిరికాయ, మందారం, పెరుగుతో కూడిన హెయిర్ మాస్క్‌లు సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది మీ జుట్టుకు అందించే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
కొబ్బరి నూనె కలపవచ్చు
పైన చెప్పిన పదార్థాలు జుట్టు, తలపై ఉపయోగించడం ద్వారా జుట్టులో గొప్ప మార్పులను చూడవచ్చు. దీన్ని మీ తలకు పట్టించి ముప్పై నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ హెయిర్ మాస్క్‌లో కొబ్బరి నూనె కాస్త కలిపితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ హెయిర్ మాస్క్ కోసం.. మెుదట ఉసిరికాయ, మందారను మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో పెరుగు కలుపుకొని మీ జుట్టుకు పట్టించవచ్చు. కావాలి అనుకుంటే కొబ్బరి నూనెను కూడా కలిపి పెట్టుకోవచ్చు. అయితే కొబ్బరి నూనెతో సేజ్ మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. మరిగించిన తర్వాత మీ జుట్టుకు పట్టించాలి. దీన్ని మీ జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయండి.
మీ జుట్టు ఆరోగ్యానికి సహాయపడే వాటిలో ఈ ఆయుర్వేద హెయిర్ మాస్క్ ఒకటి. మీరు దానిని ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండాలి. జుట్టును రెండు భాగాలుగా చేసి జుట్టు మెుదట నుంచి చివర్ల వరకూ అప్లై చేయాలి. ఆ తర్వాత కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత షవర్ క్యాప్ ఉపయోగించాలి. ముప్పై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
జుట్టు ఆరోగ్యం కోసం ఈ మాస్క్‌ను రెగ్యులర్ గా ఉపయోగించడంలో తప్పులేదు. కానీ సమయం లేని వారు కనీసం వారానికి ఒక్కసారైనా వాడుకోవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా, మితిమీరిన వాడకాన్ని కూడా నివారించాలి. ఎందుకంటే ఇది తరచుగా జిడ్డుగల జుట్టుకు దారితీస్తుంది. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జుట్టు పెరుగుదలకు ఉసిరి, మందారం, పెరుగు ఎంతగానో ఉపయోగపడతాయి.