Healthy Seeds: ఆ గింజలు ఎండబెట్టి దాచుకోండి, రోజూ గుప్పెడు తింటే ఎంతో ఆరోగ్యం
Healthy Seeds: మస్క్ మెలన్ విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆయుర్వేద నిపుణులు మస్క్ మెలన్ సీడ్స్ తినమని సిఫారసు చేస్తూ ఉంటారు.
వేసవిలో దొరికే పండు మస్క్ మెలన్. ఇది ఆరోగ్యకరమైన పండు. ఇది జ్యూసీగా ఉండే రుచికరమైన పండు. ఇది అద్భుతమైన హైడ్రేటింగ్ లక్షణాలను అందిస్తుంది. శరీరానికి పోషణను అందిస్తుంది. ప్రస్తుతం వేడిగాలులను తట్టుకునేందుకు చలువ చేసే పండు మస్క్ మెలన్. ఈ పండును తిన్నాక చాలా మంది సీడ్స్ బయటపడేస్తారు. ఆ విత్తనాలలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. జింక్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి. పండు తిన్నాక విత్తనాలు పడేయకుండా ఎండబెట్టుకుని వాటిని ఒలుచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
ఈ విత్తానాల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. శాఖాహారులకు ఇవి ప్రొటీన్ పుష్కలంగా అందిస్తుంది. ఇందులో ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ ఫ్లమ్మేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి. హార్మోన్ల ఆరోగ్యానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ మస్క్ మెలన్ విత్తనాలలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే సమ్మేళనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మస్క్ మెలన్ విత్తనాల ప్రయోజనాలు
1. ఎముకలకు అవసరమైన ఖనిజాలు: మస్మ్ మెలన్ విత్తనాలలో మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలను ప్రోత్సహిస్తాయి. ఈ ఖనిజాలు ఎముక సాంద్రతకు దోహదం చేస్తాయి. బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులను నివారించడంలో సహాయపడతాయి.
2. ప్రోటీన్ పవర్ హౌసహ: చాలా విత్తనాల మాదిరిగానే, మస్క్ మెలన్ సీడ్స్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కండరాల మరమ్మత్తు, పెరుగుదలకు ఉపయోగపడతాయి. మొత్తం శరీర అభివృద్ధికి సహాయపడతాయి.
3. మంటను నివారిస్తుంది: మస్క్ మెలన్ విత్తనాలలో ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి. ఇవి సహజమైన మొక్కల సమ్మేళనాలు. వాటిలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్ ఫ్లమ్మేషన్ నుండి రక్షించడంలో సహాయపడతాయి.
4. యాంటీఆక్సిడెంట్లు: మస్క్ మెలన్ విత్తనాలు లిగ్నన్లకు మంచి మూలం. ఇది అవిసె గింజలు, మస్క్ మెలన్ విత్తనాలలో మాత్రమే లభిస్తాయి. ఇదొక ఫైటోఈస్ట్రోజెన్. అవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. హార్మోన్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
5. కొలెస్ట్రాల్ ను తగ్గించండి: మస్క్ మెలన్ విత్తనాలలో సాపోనిన్లు, ఫైటోస్టెరాల్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్రేగులలో వాటి శోషణను నిరోధించడం ద్వారా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ సాపోనిన్లు రోగనిరోధక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వాటిలో ఆల్కలాయిడ్లు ఉంటాయి.
6. గుండె ఆరోగ్యం: ఈ విత్తనాలలో ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు ఉన్నందున గుండె ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, హృదయనాళ పనితీరు మెరుగుపడడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
7. యాంటీ ఏజింగ్: మస్క్ మెలన్ విత్తనాలలో కనిపించే కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి. UV కిరణాల వల్ల చర్మం డ్యామేజ్ కాకుండా, వృద్ధాప్యం నుండి రక్షించడానికి సహాయపడతాయి.
8. ఫైబర్ అధికంగా ఉంటుంది: దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. మలబద్దకం లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అవి ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ ను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియకు సహాయపడటానికి ఈ విత్తనాలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు తింటే మంచిది. గర్భధారణ సమయంలో ఈ విత్తనాలను ఎక్కువగా తినడం మానుకోండి. శరీరంలో ఫైబ్రాయిడ్లు లేదా తిత్తులు ఉన్నా కూడా వీటిని తినకూడదు.
టాపిక్