Summer Hair Masks : సమ్మర్ హెయిర్ కేర్.. ఇదిగో సూపర్ హెయిర్ మాస్క్‌లు-here are amazing homemade hair masks in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Hair Masks : సమ్మర్ హెయిర్ కేర్.. ఇదిగో సూపర్ హెయిర్ మాస్క్‌లు

Summer Hair Masks : సమ్మర్ హెయిర్ కేర్.. ఇదిగో సూపర్ హెయిర్ మాస్క్‌లు

HT Telugu Desk HT Telugu
Apr 15, 2023 12:30 PM IST

Summer Hair Masks : ఇది అసలే ఎండాకాలం.. చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సంరక్షణ చాలా అవసరం. వేసవిలో జుట్టు సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు.. కొన్ని హెయిర్ మాస్క్‌లు ఉపయోగించుకోవచ్చు.

సమ్మర్ హెయిర్ కేర్
సమ్మర్ హెయిర్ కేర్ (unsplash)

చర్మానికే కాదు వెంట్రుకలకు(Hairs) కూడా సమయాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది వేసవి కాలం, ఎండ, దుమ్ము ఇవన్నీ జుట్టును పాడు చేస్తాయి. కాబట్టి జుట్టు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది. వేసవిలో సహజమైన హెయిర్ ప్యాక్‌లను ఉపయోగించి మీ జుట్టును ఎలా రక్షించుకోవాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

స్వచ్ఛమైన మంచినీటితోనూ హెయిర్ మాస్క్(Hair Mask) చేసుకోవచ్చు. గంజికి కొంచెం మంచినీళ్లతో కలిపి జుట్టు మూలాలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు(Dandruff) వంటి సమస్యలు రాకుండా ఉండటమే కాకుండా జుట్టు మెరుస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఆకర్షణీయంగా మారుతుంది.

స్ట్రాబెర్రీ, పెరుగు.. హెయిర్ మాస్క్(Curd Hair Mask) చుండ్రు, తల దురద వంటి సమస్యలు ఉన్నవారికి చాలా మంచిది. ఇది చుండ్రును పోగొట్టడంలో సహాయపడుతుంది. అలాగే ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును మృదువుగా చేస్తుంది. మీరు స్ట్రాబెర్రీలకు బదులుగా ఓన్లీ పెరుగును కూడా ఉపయోగించొచ్చు.

మందార ఆకు, పువ్వులతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ జుట్టుకు కూడా చాలా మంచిది. మందార పువ్వు, ఆకులను కొన్ని నీటిలో కలిపి ఆ నీటిని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. మందార పువ్వు లేదా ఆకును నూనెలో వేసి మరిగించి ఆ నూనెను తలకు పట్టించి తలస్నానం చేయాలి.

ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు(Hair Problems) వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

Whats_app_banner