Dasara Four Days Collection: నాని (Nani) దసరా మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 87 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆదివారం రోజు దసరా సినిమాకు అన్ని భాషల్లో కలిపి 16 కోట్ల వసూళ్లు వచ్చినట్లు వెల్లడించారు.
ఓవర్‌సీస్‌లో ఈ సినిమా రెండు మిలియన్లకు చేరువలో ఉన్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఆదివారం వరకు దసరా సినిమా ఓవర్‌సీస్‌లో 1.6 మిలియన్ల కలెక్షన్స్ రాబట్టినట్లు అనౌన్స్ చేశారు. సోమవారం నాటి వసూళ్లతో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా వేస్తోన్నాయి. నాని కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా దసరా రికార్డ్ క్రియేట్ చేసింది.
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహించాడు. ఇందులో ధరణి అనే యువకుడిగా నాని నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. రస్టిక్ రోల్ కోసం అతడు మేకోవర్ అయిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతోన్నారు.
దసరాలో కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించింది. వెన్నెల పాత్రలో ఆమె యాక్టింగ్, మేనరిజమ్స్ ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్నాయి. దర్శకుడిగా తొలి సినిమాతోనే టాలీవుడ్ వర్గాలతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు శ్రీకాంత్ ఓదెల. దసరాలో దీక్షిత్ శెట్టి, టామ్ చాకో, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించాడు.