చర్మానికి కొబ్బరి నూనె రాసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Photo: Pexels
By Chatakonda Krishna Prakash May 13, 2024
Hindustan Times Telugu
కొబ్బరి నూనె జుట్టుకే కాదు.. చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ నూనెతో చాలా లాభాలు ఉంటాయి.
Photo: Pexels
చర్మానికి రెగ్యులర్‌గా కొబ్బరి నూనె రాయడం వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇక్కడ చూడండి.
Photo: Pexels
పొడిగా ఉండే, పగిలిన చర్మానికి కొబ్బరి నూనె చాలా ఉపయోగపడుతుంది. చర్మానికి ఈ నూనె తేమను అందిస్తుంది. పోషణ కల్పిస్తుంది.
Photo: Pexels
చర్మంలో కొత్త కణాల ఉత్పత్తిని పెంచడం, కొలీజన్ లెవెళ్లను కొబ్బరి నూనె అధికం చేయగలదు. దీంతో స్కిన్ డ్యామేజ్‍ను బాగా తగ్గిస్తుంది. చర్మాన్ని బిగుతుగా, ఆరోగ్యంగా చేస్తుంది.
Photo: Pexels
చర్మానికి కొబ్బరి నూనె పూసుకుంటే మొటిమలు, మచ్చలు కూడా తగ్గేందుకు సహకరిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ కారకాలు ఉంటాయి. చర్మంపై రంధ్రాలకు పోషణ అందిస్తాయి.
Photo: Pexels
కొబ్బరి నూనె రాసుకుంటే చర్మపు టెక్స్చర్ కూడా మెరుగ్గా ఉంటుంది. చర్మపు మెరుపు పెరిగేందుకు కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది.
Photo: Pexels
బిగ్‌బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నది సోనియా ఆకుల.