Ayurveda Foot Massage : ఆయుర్వేదం ప్రకారం పాదాలకు ఇలా మసాజ్ చేసుకోండి
Foot Massage Benefits : పాదాలకు మసాజ్ చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఎలా చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి.
పూర్వం ఆయుర్వేద వైద్యం ఎక్కువగా ఉండేది. మెల్లగా అల్లోపతి వైద్యం వచ్చింది. ఫలితంగా ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలు తగ్గించేశారు. మందుల వల్ల శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలియగానే మళ్లీ ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నవారు కూడా ఉన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఆయుర్వేద వైద్యం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
చాలా మంది పాదాలు, కాళ్ల రక్షణపై పెద్దగా శ్రద్ధ చూపరు. ఏది ఏమైనా ఏం కాదులే అని అనుకుంటారు. కానీ అదే కాళ్లు, పాదాలను మసాజ్ చేయడం వల్ల శరీరానికి మరింత సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది. పాదాల నుంచి తల వరకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. వారానికి ఒక్కసారైనా ఫుట్ మసాజ్ చేయడం వల్ల శక్తి, రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆయుర్వేదంలో పాద సంరక్షణ, మసాజ్ చికిత్స అనేది చాలా ముఖ్యమైనదని చెబుతారు.
రోజుకు ఒకసారి పాద మర్దన చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం పాదాలకు మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం..
పాదాలకు మసాజ్ వలన కలిగే లాభాలు
పాదాలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కీళ్ళు, మృదు కణజాలాలను బలపరుస్తుంది.
సరైన రక్త ప్రసరణ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మసాజ్ చేయడం వల్ల కాళ్లలో బెణుకులు, స్నాయువులు, కండరాలు, నరాలు నిరోధిస్తాయి. మొత్తం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
మసాజ్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అంతర్గత ఒత్తిడిని కూడా నయం చేస్తుంది. వినికిడి శక్తి కూడా పెరుగుతుంది. ఆందోళన, నిరాశ, అలసట, తిమ్మిరి నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది.
మసాజ్ చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా చేస్తుంది. రక్త ప్రసరణ ద్వారా అన్ని కణజాలాలు ఎటువంటి అవరోధం లేకుండా మెరుగుపడతాయి.
మసాజ్ ఎలా చేయాలి.
పాదాలకు మసాజ్ చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.
రోజ్మేరీ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, ఇతర ఆయుర్వేద పదార్థాలు, మూలికలను ఒక టబ్‌లో ఉపయోగించాలి.
పాదాలను నూనె, నీళ్ల మిశ్రమంలో కొన్ని నిమిషాలు నానబెట్టండి.
వృత్తాకార కదలికలో కీళ్ల చుట్టూ, కాళ్లపై నిలువుగా మసాజ్ చేయాలి.
పాదాలను టబ్ నుంచి తీసి శుభ్రం చేయాలి. ఇది శరీరం మురికి లేకుండా చేయడానికి సహాయపడుతుంది. ఆందోళన తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.
ఫుట్ మసాజ్ శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ఒక గొప్ప మార్గం. మీకు నిద్రలేమి ఉంటే, మీ పాదాలకు మసాజ్ చేయడం వల్ల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. చేతులు, కాళ్ళలో తిమ్మిరి కనిపిస్తే, పాదాలకు మసాజ్ చేయాలి. తిమ్మిరి నుంచి ఉపశమనం దొరుకుతుంది.