
(1 / 7)
మన పాదాలు ముఖ్యమైన రక్త కేశనాళికలకు నిలయం. ఆయుర్వేదం, చైనీస్ మెడిసిన్ వంటి సంపూర్ణ శాస్త్రాలు పాదాలను శ్రేయస్సు గురించి ప్రత్యేకంగా చెప్తున్నాయి. వాటిని ముఖ్యమైన అవయవంగా పరిగణిస్తున్నాయని ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ వరలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు. అందుకే ఫుట్ మసాజ్ చేయాలని అంటున్నారు. ఇంతకీ దాని వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
(pexels)
(2 / 7)
మన పాదాలు.. మన కళ్లకు సంబంధించిన నాలుగు ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటాయి. అందుకే రెగ్యులర్ ఫుట్ మసాజ్ మీ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
(Shutterstock)
(3 / 7)
పాదాలు వాత కదలిక ద్వారా నియంత్రించే అనేక నరాల చివరలను, రక్త కేశనాళికలను కలిగి ఉంటాయి. పాదాలకు మసాజ్ చేయడం వల్ల వాతంను కంట్రోల్ చేయవచ్చు.
(Pixabay)
(4 / 7)
మన పాదాలు మనల్ని భూమికి అనుసంధానించే ప్రధాన అవయవ నిర్మాణాలు. అందుకే వీటని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది.
(Unsplash)
(5 / 7)
మంచి ఫుట్ మసాజ్.. అలసిపోయిన మన పాదాలను రిలాక్స్ చేయడమే కాకుండా ఒత్తిడికి లోనైన మనసును కూడా శాంతపరుస్తుంది. మంచి ఫుట్ మసాజ్ మిమ్మల్ని ఏ స్లీపింగ్ పిల్ ఇవ్వనంత వేగంగా మీరు నిద్రపోయేలా చేస్తుంది.
(Getty Images/iStockphoto)
(6 / 7)
ఇది పాదాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పాదాల కీళ్లు, కండరాలను బలపరుస్తుంది. మధుమేహం వంటి ప్రసరణ సమస్యలతో కూడిన పరిస్థితులలో సహాయపడుతుంది.
(pexels)
(7 / 7)
కొద్దిగా గోరువెచ్చని నూనెను తీసుకుని మీ పాదాల మీద సున్నితంగా మసాజ్ చేయండి. కాలి వేళ్ల నుంచి ప్రారంభించి పాదాల కొన వరకు మసాజ్ చేయాలి. దీని కోసం నువ్వులు, బ్రహ్మి మొదలైన వెచ్చని నూనెలను ఉపయోగించండి. మీకు గాయాలు లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మసాజ్ చేయకపోవడమే మంచిది.
(pexels)ఇతర గ్యాలరీలు