Menstruation: నెలసరి సమయంలో ఇలాంటి ఆహారాలను అధికంగా తీసుకుంటే రుతుస్రావ సమస్యలు రాకుండా ఉంటాయి-eating plenty of omega 3 rich foods during menstruation can prevent menstrual problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Menstruation: నెలసరి సమయంలో ఇలాంటి ఆహారాలను అధికంగా తీసుకుంటే రుతుస్రావ సమస్యలు రాకుండా ఉంటాయి

Menstruation: నెలసరి సమయంలో ఇలాంటి ఆహారాలను అధికంగా తీసుకుంటే రుతుస్రావ సమస్యలు రాకుండా ఉంటాయి

Haritha Chappa HT Telugu
Aug 15, 2024 09:52 AM IST

Menstruation: నెలసరి సమయంలో మహిళలకు అనేక సమస్యలు వస్తాయి. పొట్ట నొప్పి, అసౌకర్యంగా ఉండడం, మూడ్ స్వింగ్స్ రావడం వంటి సమస్యలు కనిపిస్తాయి. రుతుస్రావ సమయంలో ఒమేగా -3 కొవ్వులు ఉండే ఆహారాన్ని తినడం ద్వారా ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు.

నెలసరి సమయంలో ఏం తినాలి?
నెలసరి సమయంలో ఏం తినాలి? (pexels)

ప్రతి మహిళ జీవితంలో పీరియడ్స్ ఎంతో ముఖ్యమైనవి. కానీ ఆ మూడు రోజులు కొంతమంది తీవ్ర పొట్ట నొప్పిని, తిమ్మిరిని అనుభవిస్తారు. కొందరిని చాలా అసౌకర్యంగా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి. వీటన్నింటినీ ప్రతినెలా మహిళలు తట్టుకుంటూనే ఉంటారు.

నెలసరి సమయంలో ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి ప్రత్యేకంగా కొన్ని పోషకవిలువలున్న ఆహారాలను తినిపించాలి. ముఖ్యంగా స్త్రీకి రుతుస్రావం అయినప్పుడు శరీరంలో హార్మోన్ల మార్పులకు లోనవుతుంది. కాబట్టి వారి శరీరానికి అవసరమైన పోషకాలు ఉదయం అల్పాహారంలో తీసుకోవడం చాలా ముఖ్యం.

హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైటీషియన్ షీనమ్ మాట్లాడుతూ, "రుతుస్రావం సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గడం వంటి మార్పులతో స్త్రీ ఇబ్బందికి గురవుతుంది. ఈ రెండూ ముఖ్యమైన హార్మోన్ల స్థాయిలు తగ్గడం, ప్రోస్టాగ్లాండిన్స్ అని పిలిచే ప్రోఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను విడుదల చేయడం జరుగుతుంది. ఈ సమ్మేళనాలు ప్రధానంగా గర్భాశయ సంకోచాలకు కారణం అవుతుంది. డిస్మెనోరియా అని పిలిచే పొట్టనొప్పి పెంచుతుంది’ అని చెప్పారు.

ఏం తినాలి?

నెలసరి సమయంలో ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొనే మహిళలు ఆ సమయంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలను తినాలి. ఇవి ఆరోగ్యపరంగా స్త్రీలను కాపాడతాయి. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహారాలను తినడం అలవాటు చేసుకోవాలి. అల్పాహారంలో గుడ్లు, వోట్స్, అవిసె గింజలు, చియా గింజలు వంటివి తినాలి.

తిమ్మిరి తగ్గడం: ఒమేగా -3 కొవ్వులు వాటి రోగనిరోధక మాడ్యులేటరీ పాత్ర కారణంగా రుతుస్రావం సమయంలో తినేటప్పుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒమేగా -3 కొవ్వుల వినియోగం వల్ల తిమ్మిరి, నొప్పి, మంట వంటి రుతుక్రమ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మూడ్ లిఫ్టింగ్: చికాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు వంటి ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) లక్షణాలను తగ్గించడంలో ఒమేగా -3 కొవ్వుల పాత్ర ఉంది.

మెదడు ఆరోగ్యం: ఒమేగా -3 కొవ్వులు శక్తి స్థాయిలను పెంచుతాయి. ఒక వ్యక్తిని మరింత దృష్టి సారించేలా చేస్తాయి.

స్మూతీస్: మన అల్పాహారం స్మూతీలో చియా విత్తనాలు, అవిసె గింజలను చేర్చవచ్చు. దీనిని ఇతర గింజలు, పండ్లతో కలపవచ్చు.

ఒమేగా -3 కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలు: ప్రతి ఉదయం అల్పాహారంలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి.

సప్లిమెంట్స్: మనం అనేక ఆహార వనరులను జోడించలేకపోతే, చేప నూనె వంటి ఒమేగా 3 క్యాప్సూల్ తీసుకోవడం కూడా సహాయపడుతుంది.

పగటిపూట పోషకాల శోషణ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి పగటిపూట వాటిని చేర్చడం ఉత్తమం అని డైటీషియన్ షీనమ్ చెప్పారు.

Whats_app_banner