Chia Seeds VS Flax seeds: చియా సీడ్స్ Vs అవిసె గింజలు, వీటిలో వేటిని తింటే త్వరగా బరువు తగ్గుతారు
Chia Seeds VS Flax seeds: ఆహారంలో నట్స్, సీడ్స్ వంటిని కచ్చితంగా తినాలి. ఈమధ్య బరువు తగ్గేందుకు ఎక్కువ మంది తింటున్నవి ఈ గింజలే. ఈ రెండింటిలో వేటిని తింటే త్వరగా బరువు తగ్గుతారో తెలుసుకోండి.
Chia Seeds VS Flax seeds: ఒకప్పుడు జీడిపప్పులు, బాదంపప్పులు, వాల్ నట్స్ వంటివి ఎక్కువ మంది ఇష్టంగా తినేవారు. ఇప్పుడు చియా గింజలు, అవిసె గింజలను తింటున్నారు. ముఖ్యంగా పోషకాహార నిపుణులు వీటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతుండటంతో తినేవారి సంఖ్య పెరిగింది. బరువు తగ్గాలనుకునే వారికి చియా విత్తనాలు, అవిసె గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండు విత్తనాలలో పోషకాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల సమతల ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. ఎంతో మందికి ఉన్న సందేహం చియా సీడ్స్ లేదా అవిసె గింజల్లో వేటిని తింటే ఎక్కువ ఆరోగ్యకరం అని.
చియా సీడ్స్ తింటే...
చియా విత్తనాలలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణ ఆరోగ్యం అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చియా విత్తనాలలో ఉండే ప్రోటీన్... మొక్కల ఆధారిత ప్రోటీన్. అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇన్ఫమ్లేషన్ వంటి సమస్యలు తగ్గుతాయి.
అవిసె గింజలు తింటే...
అవిసె గింజలు సీడ్స్ కన్నా కాస్త పెద్దవిగా ఉంటాయి. వీటి రుచి బాగుంటుంది. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, మాంగనీస్, విటమిన్ బి1 నిండుగా ఉంటాయి. అవిసె గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఎన్నో రకాల క్యాన్సర్ నుంచి దీనికి రక్షణ లభిస్తుంది. అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణ క్రియకు సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది.
పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం చియా గింజలు, అవిసె గింజలు ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. ఈ రెండింటిలో కూడా ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. తిన్న తర్వాత పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తాయి. కాబట్టి ఈ రెండింటిని తినడం మంచిదే.
చియా గింజలు, అవిసె గింజలు వంటి వాటిని స్మూతీలు, సలాడ్లు, సూపుల్లో భాగం చేసుకుంటే మంచిది. అవిసె గింజలు కాస్త పెద్దవిగా ఉంటాయి. కాబట్టి వాటిని పొడిలా చేసి వాడుకోవాలి.పాన్ కేకులు, మఫిన్లు వంటి వాటిలో కూడా కలిపి వండుకోవచ్చు. రోజువారీ ఆహారంలో ఈ రెండు గింజలను భాగం చేసుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఏదో ఒకటి మాత్రమే తినాలని అనుకోవద్దు. ఈ రెండూ కలిపి తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ రెండు కలిపి గుప్పెడు తింటే మానసికంగా ఎన్నో లాభాలు పొందవచ్చు.