Chia Seeds Lemon Water : రక్తపోటును తగ్గించేందుకు చియా విత్తనాలు, నిమ్మకాయ రసం ఎలా తీసుకోవాలి?-add lemon in chia seeds water to get amazing health benefits and control blood pressure ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chia Seeds Lemon Water : రక్తపోటును తగ్గించేందుకు చియా విత్తనాలు, నిమ్మకాయ రసం ఎలా తీసుకోవాలి?

Chia Seeds Lemon Water : రక్తపోటును తగ్గించేందుకు చియా విత్తనాలు, నిమ్మకాయ రసం ఎలా తీసుకోవాలి?

Anand Sai HT Telugu
Jun 04, 2024 05:20 PM IST

Chia Seeds Benefits In Telugu : చియా గింజలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వీటిని నిమ్మ రసంతో కలిపి తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

చియా విత్తనాల ప్రయోజనాలు
చియా విత్తనాల ప్రయోజనాలు

రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలను ప్రభావితం చేసే వ్యాధి. అధిక రక్తపోటు వ్యాధి ముదిరే వరకు స్పష్టమైన లక్షణాలను చూపించదు కాబట్టి దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. దీర్ఘకాలికంగా అధిక రక్తపోటును అనుభవించడం ఒక వ్యక్తిని అనేక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు గురి చేస్తుంది..

సాధారణ రక్తపోటు పరిధి 120/80 mmHgగా పరిగణించబడుతుంది. 140/90 కంటే ఎక్కువ ఉంటే అధిక రక్తపోటుగా పరిగణించబడుతుంది. ఇతర జీవనశైలి వ్యాధుల మాదిరిగానే, సరైన ఆహారం, సమతుల్య జీవనశైలి ఈ పరిస్థితిని నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. అయితే చియా విత్తనాలు అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. మీ రక్తపోటును నియంత్రించడానికి చియా విత్తనాలు, నిమ్మకాయలను ఎలా ఉపయోగించవచ్చో చదవండి.

చియా విత్తనాలు సూపర్ ఫుడ్

మనందరికీ తెలిసినట్లుగా చియా విత్తనాలు ఒక సూపర్ ఫుడ్. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సీడ్స్‌లో ఫైబర్, ప్రొటీన్, అనేక మాక్రోన్యూట్రియెంట్స్ ఉంటాయి. ఆహారంలో చియా విత్తనాలను చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వీటిలో ఉంటాయి. చియా విత్తనాలు రక్తపోటును తగ్గించడానికి గొప్ప మార్గం.

ఉదయం తాగండి

ఉదయాన్నే ఒక గ్లాసు నీరు తాగి రోజు ప్రారంభించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అది మంచి విషయమే. కానీ మీరు సాధారణ నీటికి బదులుగా చియా కలిపిన నీటిని తాగితే ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఈ డ్రింక్‌లో నిమ్మరసం కలుపుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

నిమ్మకాయ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించడానికి, గొంతు నొప్పికి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయం చేస్తాయి.

ఎలా సిద్ధం చేయాలి?

ఈ పానీయం సిద్ధం చేయడం చాలా సులభం. చియా గింజలను ఒక కప్పు నీటిలో గంటసేపు నానబెట్టండి. అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. తేనెను కూడా జోడించవచ్చు. ఈ పానీయం అందరికీ సురక్షితమైనది అయినప్పటికీ, దీనిని ప్రయత్నించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

చియా విత్తనాలు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించగలవని, మధుమేహానికి చికిత్స చేయగలవని, అకాల వృద్ధాప్యాన్ని నిరోధించగలవని, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌లతో పోరాడగలవని పరిశోధనలో తేలింది. ఇది ఎముకలను బలపరుస్తుందని కూడా చెబుతారు. కండరాల నిర్మాణానికి, రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి, కొవ్వును కరిగించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

చియా విత్తనాలు మెుత్తం ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవద్దు. కొద్ది మెుత్తంలో తీసుకుంటే మంచిది.

ఈ విషయాలు కూడా పాటించండి

రక్తపోటును తగ్గించుకోవడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.

వ్యాయామాన్ని అలవాటు చేసుకోండి.

ఉప్పు తీసుకోవడం తగ్గించండి.

కాఫీ వినియోగాన్ని తగ్గించండి.

ఒత్తిడిని నిర్వహించండి.

మీ బరువును నియంత్రించండి.

ధూమపానం, మద్యపానం మానేయండి.

చక్కెర వినియోగాన్ని తగ్గించండి.

పౌష్టికాహారం తినండి.

WhatsApp channel