అరటి చెట్టులోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిద్వారా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అరటి కాండం కూడా మనకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

Unsplash

By Anand Sai
Jun 04, 2024

Hindustan Times
Telugu

అరటి కాండంలో పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. సాంప్రదాయ వైద్యంలోనూ అరటి కాండం ఉపయోగిస్తారు.

Unsplash

మూత్ర విసర్జన సరిగా లేని వారు అరటి కాండం తీసుకోవాలి. మలబద్ధకం సమస్య కూడా పరిష్కారమవుతుంది.

Unsplash

అరటి కాండం నరాల సమస్యలను నయం చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. రోజూ రెండు లేదా మూడు చెంచాల అరటి కాండం రసాన్ని తాగితే తరచుగా వచ్చే పొడి దగ్గు నయమవుతుంది.

Unsplash

చెవులకు సంబంధించిన సమస్యలు, గర్భాశయ సంబంధిత వ్యాధులు, రక్తశుద్ధి తదితర సమస్యలు సరిచేయాలంటే ప్రతిరోజూ ఒక కప్పు అరటి కాండం సూప్ తాగండి.

Unsplash

కామెర్లు ఉన్నవారు అరటి కాండంను ఎండలో బాగా ఆరబెట్టి పొడిలా చేసుకుని.. రోజూ ఒక చెంచా తీసుకుని అందులో తేనె కలుపుకొని తీసుకోవాలి.

Unsplash

అరటి కాండంలో కాస్త ఆవాలు కలుపుకొని తింటే అలెర్జీ, చర్మ చికాకు, మూలవ్యాధి సమస్యలు తగ్గుతాయి.

Unsplash

రుతుక్రమం సమయంలోనూ మహిళలకు వచ్చే వివిధ సమస్యలకు అరటి కాండం ద్వారా పరిష్కారం దొరుకుతుంది.

Unsplash

పక్షవాతం వచ్చే ముందు శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి?

Image Source From unsplash