Heart Attack: వేడి వాతావరణంలో గుండెపోటు వచ్చే అవకాశం రాకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి చాలు-just do this little thing to avoid heart attack in hot weather ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Attack: వేడి వాతావరణంలో గుండెపోటు వచ్చే అవకాశం రాకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి చాలు

Heart Attack: వేడి వాతావరణంలో గుండెపోటు వచ్చే అవకాశం రాకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి చాలు

Haritha Chappa HT Telugu
Jun 02, 2024 01:30 PM IST

Heart Attack: అధిక ఉష్ణోగ్రతల వద్ద గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి వేడి వాతావరణంలో గుండెను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రతిరోజూ మీరు ఐదు గ్లాసుల నీరుని తాగండి చాలు.

గుండె పోటు రాకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోండి
గుండె పోటు రాకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోండి (Pixabay)

Heart Attack: ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. వేడి గాలులు గుండెపోటు అవకాశాలను పెంచుతాయి. శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రత పెరిగిపోతే, హృదయ స్పందన రేటు మారిపోతుంది. రక్త ప్రవాహంలో కూడా మార్పులు వస్తాయి. దీనివల్ల గుండె విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. ఇది గుండెపోటుకు లేదా గుండె వైఫల్యానికి కారణం అవుతుంది. కాబట్టి విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు గుండెపోటు రాకుండా అడ్డుకోవడానికి వైద్యులు చిట్కాలు చెబుతున్నారు. ఈ చిన్న చిట్కాను పాటిస్తే గుండెను కాపాడుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సినదల్లా ప్రతిరోజూ దాహం వేసినా, వేయకపోయినా ఐదు గ్లాసులు తగ్గకుండా నీటిని తాగాలి. అలా తాగడం వల్ల గుండెతో పాటు అంతర్గత అవయవాలు తేమవంతంగా ఉంటాయి. గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.

తాజాగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం శరీరం డిహైడ్రేషన్ బారిన పడితే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి అధిక నీటిని, ద్రవాలను తీసుకోవడం ద్వారా గుండె వైఫల్యం చెందకుండా కాపాడుకోవచ్చు. అధిక వేడి వాతావరణంలో గుండె వైఫల్యం కలిగే అవకాశం ఉంటుంది.

ఏం తాగాలి?

డీ హైడ్రేషన్ అనేది గుండె పనితీరుపై చాలా హానికరమైన ప్రభావాలను చూపిస్తుంది. గుండె స్పందనను మారుస్తుంది. దీనివల్ల గుండె దడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వేడి వాతావరణంలోని నీళ్లు, చక్కెర కలపని పండ్ల రసాలను తినడం మంచిది. అలా కాకుండా సోడాలు, ఆల్కహాలు, చక్కెర నిండిన పానీయాలు తింటే మాత్రం తాగితే గుండెకు ప్రమాదమే.

నేటి వాతావరణంలో గుండెను కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి

బయట విపరీతమైన వేడి ఉన్నప్పుడు ఇంటి లోపలే ఉండాలి. బయటికి వెళ్ళకూడదు. కఠినమైన వ్యాయామాలు చేయకూడదు. చిన్న చిన్న వ్యాయామాలను మాత్రమే ఉంచుకోవాలి. గాలి తగిలేలా ఫ్యాన్ కింద ఉండడం ఉత్తమం. తేలికగా, వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. బయటికి వెళ్లాల్సి వస్తే టోపీని లేదా గొడుగును కచ్చితంగా ధరించాలి. ఆహారంలో నీరు నిండిన పదార్థాలను తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు వంటివి అధికంగా తీసుకోవాలి. మజ్జిగను అధికంగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల శరీరం తేమవంతంగా ఉంటుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటిది రాకుండా ఉంటాయి.

Whats_app_banner