తెలుగు న్యూస్ / ఫోటో /
Flaxseeds benefits: గుప్పెడు అవిసె గింజలు, అరగంట సమయం చాలు.. అందం సమస్యలకు చెక్
Flaxseeds benefits: అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా, అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అవిసె గింజలను జెల్ ను నిర్జీవంగా ఉన్న జుట్టుకు, ముడతలు పడిన చర్మ ఆరోగ్యానికి ఉపయోగించవచ్చు.
(1 / 7)
మీ జుట్టు పొడిగా, నిర్జీవంగా ఉందని, మీ చర్మం డల్ గా మారిందని అనిపిస్తుందా? ఇది సాధారణంగా శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల జరగొచ్చు. అవిసె గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం నుండి మలినాలను తొలగించడంలో సహాయపడతాయి. చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. అంతే కాకుండా అవిసె గింజలతో తయారు చేసిన జెల్ తో జుట్టు పొడిబారడాన్ని తగ్గించుకోవచ్చు. చర్మ సమస్యలూ తగ్గిపోతాయి. దాన్నెలా తయారు చేయాలో చూసేయండి. (shutterstock)
(2 / 7)
అవిసె గింజల జెల్ తయారీ: రెండు మూడు టేబుల్ స్పూన్ల అవిసె గింజలను నీటిలో మరిగించాలి. అది సగానికి చిక్కబడే వరకు మరిగించాలి. కాసేపు అలాగే వదిలేయాలి.(shutterstock)
(3 / 7)
ఇప్పుడు దానిని వడగట్టి శుభ్రమైన సీసాలో ఉంచాలి. అవిసె గింజల నుండి నేచురల్ జెల్ రెడీ. మీరు దీన్ని చర్మం, జుట్టు రెండింటికీ ఉపయోగించవచ్చు.(shutterstock)
(4 / 7)
అవిసె గింజల జెల్ ను జుట్టుకు ఎలా అప్లై చేయాలి? అవిసె గింజల జెల్ జుట్టుకు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. షాంపూ చేసిన తర్వాత ఈ జెల్ ను జుట్టుకు అప్లై చేసి 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో తలస్నానం చేయాలి.(shutterstock)
(5 / 7)
దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు పూర్తిగా మృదువుగా,పట్టుకుచ్చు లాగా మెరిసిపోతుంది.(shutterstock)
(6 / 7)
చర్మానికి అవిసె గింజల జెల్: ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ల కారణంగా, ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని బిగుతుగా చేయడానికి, ముడతలను, మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి.(shutterstock)
ఇతర గ్యాలరీలు