Garlic Tomato Egg Recipe: గార్లిక్ టమాటో ఎగ్ రెసిపీ... ప్రోటీన్స్ నిండిన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, చేయడం చాలా ఈజీ
Garlic Tomato Egg Recipe: హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఇక్కడ మేము ప్రోటీన్స్ నిండిన హెల్తీ ఎగ్ రెసిపీని అందించాము.
Garlic Tomato Egg Recipe: బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తినమని పోషకాహార నిపుణులు చెబుతారు. గుడ్లను మించిన ప్రోటీన్ ఫుడ్ ఇంకేముంటుంది. ఇక్కడ మేము గుడ్లతో సింపుల్‌గా చేసే రెసిపీ ఇచ్చాము. గార్లిక్ టమాట ఎగ్ రెసిపీ అని పిలుస్తారు. దీన్ని డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ ఆహారంగా చెప్పుకోవచ్చు. దీన్ని చాలా సులువుగా పది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. కాబట్టి త్వరగా వండేయచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే గార్లిక్ టమాటో ఎగ్ రెసిపి ఎలా చేయాలో తెలుసుకోండి.
గార్లిక్ టమాటో ఎగ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గుడ్లు - రెండు
టమోటో - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - మూడు
ఆలివ్ నూనె - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
గార్లిక్ టమాటో ఎగ్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఆలివ్ నూనె వేయాలి.
2. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి.
3. ఇప్పుడు గుడ్లను పగలగొట్టి అందులో వేయాలి.
4. సన్నగా తరిగిన టమోటో ముక్కలను గుడ్లపై చల్లాలి.
5. అలాగే కొత్తిమీర తరుగును, రుచికి సరిపడా ఉప్పును, మిరియాల పొడిని కూడా పైన చల్లుకోవాలి.
6. మూత పెట్టి ఐదు నిమిషాలు పాటు వదిలేయాలి.
7. తర్వాత మూత తీసి గరిటెతో దాన్ని ముక్కలు చేసి కలుపుకోవాలి.
8. టమోటాలు కూడా ఉడికేలా చూసుకోవాలి. కావాలనుకుంటే పైన సన్నగా చీజ్ తురుమును వేసుకోవచ్చు. లేదా చిల్లి ఫ్లెక్స్ కూడా జల్లుకోవచ్చు.
9. అలా ఏమీ చల్లుకోకుండా తిన్నా కూడా టేస్టీగానే ఉంటుంది.
10. ఇది కేవలం పది నుంచి 15 నిమిషాల్లో సిద్ధమైపోతుంది.
11. ఇది ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు.
ప్రోటీన్ నిండిన ఈ రెసిపీని తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యంగా బరువు తగ్గవచ్చు. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉత్తమ ఆహారం. ఉదయాన్నే ఈ ప్రోటీన్ నిండిన బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల ఆ రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇలా ప్రతిరోజు ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. దీని రుచి టేస్టీగానే ఉంటుంది. ఒకసారి దీన్ని వండుకొని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. పైగా పోషకాలను కూడా అందిస్తుంది.
టాపిక్