Saggubiyyam Khichdi Recipe । సగ్గుబియ్యం ఖిచ్డీ.. చక్కెరలు తక్కువ ఉండే చక్కని అల్పాహారం!
Saggubiyyam Khichdi Recipe: మీరు తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన తేలికైన అల్పాహారం తినాలనుకుంటున్నారా? అయితే సగ్గుబియ్యంతో ఇలా రుచికరంగా ఖిచ్డీ చేసుకోండి, రెసిపీ ఇక్కడ చూడండి.
Saggubiyyam Khichdi Recipe (stock pic)
సగ్గుబియ్యంను సాబుదానా అని కూడా పిలుస్తారు. సగ్గుబియ్యంతో పాయసం వండుకోవచ్చు, అలాగే ఖిచ్డీలాగా కూడా చేసుకోవచ్చు. మీకోసం ఇక్కడ రుచికరమైన సగ్గుబియ్యం ఖిచ్డీ రెసిపీని అందిస్తున్నాం. ఇది తేలికైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా రాత్రి సమయంలో ఉపాహారంగా కూడా తీసుకోవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి అల్పాహారంగా ఉంటుంది. సగ్గుబియ్యం ఖిచ్డీ ఎలా చేయాలో ఈ కింద సూచనలు ఉన్నాయి, వాటిని అనుసరించి సులభంగా చేసుకోవచ్చు.
Saggubiyyam Khichdi Recipe కోసం కావలసినవి
- సాబుదానా : 1 కప్పు
- వేరుశనగలు : 1/4 కప్పు
- నూనె : 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర : 1/2 tsp
- కరివేపాకు : 10-12
- పచ్చిమిర్చి : 3-4
- బంగాళదుంప : 1 మీడియం (ఉడికించినది)
- పచ్చి కొత్తిమీర : 2 టేబుల్ స్పూన్లు
- రాతి ఉప్పు : 1/2 tsp
- నిమ్మకాయ: 1
సగ్గుబియ్యం ఖిచ్డీ తయారీ విధానం
- ఒక పాత్రలో సాబుదానా తీసుకొని నీటితో శుభ్రంగా కడగండి, ఆ వెంటనే నీటిలో నానబెట్టి, 4-5 గంటలు అలాగే ఉంచండి.
- ఈలోపు వేరుశనగలను వేయించి మామూలుగా గ్రైండ్ చేయండి.
- అనంతరం బాణలిలో నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయండి. ఆపై అందులో జీలకర్ర వేసి వేయించండి.
- ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని కలపాలి.
- అనంతరం ఉడికించిన బంగాళదుంపలు, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులోనే వేరుశనగ మిశ్రమం వేసి బాగా కలపాలి.
- చివరగా నిమ్మరసం పిండుకోవాలి, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.
అంతే, అద్భుతమైన సాబుదానా ఖిచ్డీ సిద్ధం అయినట్లే. దీనిని వేడివేడిగా ఆరగించండి.
సంబంధిత కథనం