Sabudana Vada Recipe । సంతృప్తికరమైన అల్పాహారం.. సాబుదానా వడ!-easy to make and a delight to tuck into here is sabudana vada breakfast recipe for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Easy To Make And A Delight To Tuck Into, Here Is Sabudana Vada Breakfast Recipe For You

Sabudana Vada Recipe । సంతృప్తికరమైన అల్పాహారం.. సాబుదానా వడ!

HT Telugu Desk HT Telugu
Oct 27, 2022 07:34 AM IST

ముత్యాల లాంటి సాబుదానాతో మెత్తగా కరకరలాడే సాబుదానా వడల చేసుకోండి. ఉపవాసం సమయాల్లో ఉది మంచి అల్పాహారం కూడా ఎలా తయారు చేసుకోవాలో Sabudana Vada Recipe ఇక్కడ ఇస్తున్నాం చూడండి.

Sabudana Vada Recipe
Sabudana Vada Recipe (Unsplash)

ముత్యాల లాంటి మృదువైన చిన్న బంతులు, ఉడికించిన బంగాళాదుంపలు, జీలకర్ర, మిరియాలు, రాక్ సాల్ట్‌ అన్ని కలిపి వండిన ఈ చిరుతిండిని తింటే.. దీని రుచికి మీరు 'వావ్ వావ్ వావ్' అంటూ అనడం గ్యారెంటీ. మీరు మినప వడలు, గారెలు చాలా సార్లు తినే ఉంటారు. చిన్న చేంజ్ కోసం సాబుదాన వడ తిని చూడండి. ఈ గ్లూటెన్ రహిత, శాకాహారి చిరుతిండి ఉదయం అల్పాహారంగా అయినా, సాయంత్రం స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు.

సాబుదాన వడలను తయారు చేయడం చాలా సులభం. వీటిని ఎక్కువగా ఉపవాస సమయాల్లో చేసుకుంటారు. సాధారణంగా ఉపవాస సమయంలో ఉల్లి, వెల్లుల్లి, గోధుమలు, పప్పులు, బియ్యం వంటివి తీసుకోరు. వీటికి ఒక ప్రత్యామ్నాయంగా సాబుదానా చేసుకోవచ్చు.

వడ వావ్ వావ్ వావ్ అంటూ, నానబెట్టిన టపాకాయ బంతులు, ఉడికించిన బంగాళాదుంపలు, జీలకర్ర, మిరియాలు మరియు రాక్ సాల్ట్‌తో చేసిన ఈ కరకరలాడే వడలను తిన్న తర్వాత మీరు అలాగే అరుస్తారు. తయారుచేయడం సులభం మరియు ఆహ్లాదకరమైన ఈ సబుదానాలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, కాబట్టి ఎక్కువ కాలం పాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. సాబుదానా ఖిచ్డీ, సాబుదానా పోహా, పాయసం ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు సాబుదానా వడ రెసిపీని చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు, తయారీ విధానం కోసం ఈ కింద చూడండి.

Sabudana Vada Recipe కోసం కావలసినవి

1 కప్పు సాబుదానా

1/2 కప్పు ఉడికించిన బంగాళాదుంప

1/2 కప్పు వేయించిన వేరుశెనగ పొడి

1/2 tsp తురిమిన అల్లం

1 పచ్చిమిర్చి తరిగినది

1 tsp కరివేపాకు

1 స్పూన్ జీరా

రుచికి తగినంత రాక్ సాల్ట్

1 స్పూన్ నిమ్మరసం

డీప్ ఫ్రై చేయడానికి నూనె

సాబుదానా వడ రెసిపీ- తయారీ విధానం

  1. సాబుదానా వడ తయారీలో చాలా ముఖ్యమైన భాగం సాబుదానాను నీటిలో బాగా నానబెట్టడం. సాబుదానా ముత్యాలన్నీ మెత్తగా అయ్యేంతవరకు. కనీసం 2-3 గంటలు పట్టవచ్చు. ఈ లోపు మీరు పల్లీలను వేయించి వాటిని పొడిగా సిద్ధం చేసుకోవాలి.
  2. సాబుదానా నీటిలో నాని మెత్తగా అయిన తర్వాత, నీటిని వేర్చు చేసి సాబుదానా ముత్యాలలో ఉడికించి బంగాళాదుంప ముక్కలను కలపండి.
  3. ఆపై పల్లీల పొడి, అల్లం తురుము, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, జీరా, రాక్ సాల్ట్ వేయండి. ఆపై నిమ్మరసం పిండాలి.
  4. ఇప్పుడు అన్నింటిని బాగా కలిపి, మిశ్రమాన్ని పిండి ముద్దలుగా చేసుకోవాలి.
  5. చిన్న పిండి ముద్దలను ఫ్లాట్ రౌండ్ వడ లేదా ప్యాటీగా ఆకృతి చేయండి.
  6. వీటిని నూనె వేడి చేసి, ఆపై మీడియం మంట మీద రెండు వైపులా లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించాలి.

అంతే కరకరలాడే సాబుదానా వడ రెడీ. గ్రీన్ చట్నీ, కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని అద్దుకొని తినవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్