Tea and Coffee: ఖాళీ పొట్టతో కాఫీ, టీలు తాగేస్తున్నారా? అందుకే మీకు తరచూ ఈ సమస్యలు వస్తున్నాయి
Tea and Coffee: కాఫీ, టీలు.. పానీయాలు కాదు. అవి భావోద్వేగాలుగా మారిపోయాయి. ఉదయం లేచి అవి తాగకపోతే ఏ పని చేయలేరు ఎంతోమంది. వాటిని తాగకపోతే రోజంతా ఏదో కోల్పాయినట్టు ఫీలవుతారు.
Tea and Coffee: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే పానీయాలలో కాఫీ, టీలే మొదటి స్థానంలో ఉంటాయి. ప్రపంచంలో మూడు వేల కంటే ఎక్కువ రకాల కాఫీ, టీలు దొరుకుతున్నాయి. ఎంతో మంది వీటిని ఖాళీ పొట్టతోనే తీసుకుంటూ ఉంటారు. ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేశాక చేసే మొదటి పని... టీ తాగడం లేదా కాఫీ తాగడం. నిజానికి అది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరచవచ్చు కానీ దీర్ఘకాలంగా ఇలా ఖాళీ పొట్టతో కాఫీ, టీలను తాగడం వల్ల శరీరానికి నిశ్శబ్దంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మనదేశంలో బ్లాక్ టీ లేదా పాలతో చేసిన టీలను ఇష్టంగా తాగుతారు. వీటిని ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, పొట్ట అసౌకర్యంగా అనిపించడం, అల్సర్లు వంటి జీర్ణ రుగ్మతలు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. ఖాళీ పొట్టతో టీ తాగడం ఏ మాత్రం మంచిది. కాదు. ఇది జీవక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఉదయం లేచిన తర్వాత ఖాళీ పొట్టతో మనం తాగే మొదటి పానీయం... పొట్టలోని, నోట్లోని బ్యాక్టీరియాను శుభ్రపరిచేదిగా ఉండాలి. కానీ ఉదయాన్నే అధిక మొత్తంలో టీ, కాఫీలు తాగడం వల్ల లేదా పాలతో చేసిన పానీయాన్ని తాగడం వల్ల నోటి నుంచి పొట్ట వరకు బ్యాక్టీరియా చేరుకుంటుంది. ఇది జీవక్రియను ప్రభావితం చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఈ సమస్యలు వస్తాయి
ఖాళీ పొట్టతో అధిక కెఫీన్ ఉన్న పానీయాలు తాగడం వల్ల గుండెల్లో మంట, ఛాతీ నొప్పి, కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, అల్సర్ నొప్పి వంటివి వస్తాయి. కానీ అవి టీ, కాఫీల వల్ల వస్తున్నాయని మాత్రం గుర్తించలేరు. ప్రజలు టీ, కాఫీలలో కెఫీన్ అధికంగా ఉంటుంది. ఇలా కెఫీన్ ఆధారిత పానీయాలలో ఉండే యాసిడ్ పొట్టలో యాసిడ్ రిఫ్లెక్స్ కు కారణం అవుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం మొదలవుతుంది. ఖాళీ పొట్టతో టీ తాగే అలవాటు ఉన్నవారు డిహైడ్రేషన్‌కు గురవుతారు. శరీరం నుంచి అవసరమైన ద్రవాలు బయటికి పోతూ ఉంటాయి. దీనివల్ల ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.
ఖాళీ పొట్టతో టీ తాగడం వల్ల శరీరం అభివృద్ధిపై కూడా ఇది ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే టీలో టానిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనం తినే ఆహారంలోని ఇనుమును శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటాయి. అప్పుడు ఐరన్ లోపం వస్తుంది.
పాలతో చేసిన టీ లేదా కాఫీ, బ్లాక్ టీ వంటివి తాగడం మానేయాలి. ఉదయానే పసుపు ,వేప, తులసి, నిమ్మవంటి మూలికలతో చేసిన టీలను తాగడం మంచివి. ఇవి శరీరం నుండి బ్యాక్టీరియాలను బయటకు పంపిస్తాయి. వీటిలో కెఫీన్ కూడా ఉండదు. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
టాపిక్