Iron Pan: ఇనుముతో చేసిన కళాయిలో వండకూడని ఆహార పదార్థాలు ఇవే
Iron Pan: ఇనుముతో చేసిన వంట పాత్రల్లో ఇప్పటికీ వండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే దీనిలో కొన్ని రకాల ఆహారాలు ఉండకూడదు అవి ఏ ఆహారాలో ఇప్పుడు తెలుసుకుందాం
Iron Pan: క్యాస్ట్ ఐరన్ లేదా ఐరన్ కళాయి.. ఇనుముతో చేసిన కళాయిని ఇలా పిలుస్తారు. ఇనుముతో చేసిన కళాయిలను పూర్వం అధికంగా వినియోగించేవారు. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్లు వచ్చాక వీటి వాడకం తగ్గింది. అయినా కూడా కొంతమంది ఇళ్లల్లో ఇనుము కళాయిలు ఇంకా కనిపిస్తున్నాయి. వీటిల్లో అన్ని రకాల ఆహారాలు వండకూడదు. కొన్నింటిని వండడం వల్ల వాటి రంగు, రుచి, ఆకృతిలో మార్పు వస్తుంది. దీని వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఎలాంటి ఆహారాలలో వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పుల్లని ఆహారాలు
పుల్లని ఆహార పదార్థాలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఎసిడిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఐరన్ కళాయిలో పుల్లని పదార్థాలను వండడం వల్ల రంగు మారిపోతుంది . ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.
సీ ఫుడ్
కొన్ని రకాలు చేపలు చాలా లేతగా, సున్నితంగా ఉంటాయి. అలాంటి చేపలను, సముద్రపు జీవులైన రొయ్యలు వంటి వాటిని ఇనుప కళాయిలో వండకూడదు. వాటిని వండితే వాటికి లోహపు రుచి వచ్చేస్తుంది. రుచిగా ఉండవు.
గుడ్లు, పాలు
గుడ్లతో వండే వంటకాలు, పాలు ఆధారిత వంటకాలు... ఇనుప కళాయిలో వండకూడదు. ఆమ్లెట్లు వంటివి ఇనుప కళాయిలో వేయకూడదు. అలాగే పాలతో చేసే పాయసాలు వంటివి కళాయిలో వండకూడదు. ఇనుములో ఉండే పోరస్ స్వభావం అందులో వండిన ఆహారాలకు వస్తుంది. దీనివల్ల రుచి, వాసన మారిపోతుంది.
మసాలా వంటకాలు
నిమ్మరసం, చింతపండు, వెనిగర్ వంటివి ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే అధిక మసాలా వంటకాలను ఈ ఇనుము పాత్రలో వండడం వల్ల వాటి రుచి, రంగు మారిపోతాయి.
కొన్ని రకాల కూరగాయలు
కొన్ని రకాల ఆకుకూరలు, పుట్టగొడుగులు వంటి వాటిని ఇనుప కళాయిలో వండకూడదు. అవి కళాయికి అతుక్కుపోతాయి. దీనివల్ల వాటి రంగు, రుచి, ఆకృతి మారిపోతాయి. అవి చాలా మెత్తగా ఉడుకుతాయి. ఇనుము నుంచి అధిక వేడి వస్తుంది. ఈ అధిక వేడిని కూరగాయలు తట్టుకోలేవు. కాబట్టి ఇనుప కళాయిలో ఆకుకూరలు, పుట్టగొడుగులను వండకూడదు.
టాపిక్