Foods to avoid after eating Fish: చేపలు తిన్నాక దూరంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవే, ఎందుకంటే...
Foods to avoid after eating Fish: చేపలు తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు.
చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది... ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదు. దీనిలో లీన్ ప్రోటీన్‌తో పాటూ, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియాల నుంచి కాపాడతాయి. మాంసాహారాల్లో ఆరోగ్యకరమైనవి చేపలే. ఇవి తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించారు.
చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. గుండెకు రక్తప్రసరణ కూడా సవ్యంగా జరుగుతుంది. అందుకే గుండె ఆరోగ్యం కోసం చేపలను తినమని చెబుతారు. చేపలను తరచూ తినేవారిలో జ్ఞాపకశక్తి కూడా అధికంగా ఉంటుంది. మెదడుకు అత్యవసరమైన పోషకాలు అన్నీ చేపల్లో ఉన్నాయి.
అందుకే వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు చేపలతో భోజనం చేయమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అయితే చేపలు తిన్నాక కొన్ని రకాల ఆహారాలను దూరంగా పెట్టాలి, లేదా ఈ ఆహారాలను తిన్నాక చేపలను తినకూడదు. ఈ రెండింటికీ మధ్య కనీస రెండు గంటల గ్యాప్ ఇచ్చాకే వీటిని తినాలి. కొన్ని ఆహారాలతో చేపలను జత చేయడం వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. జీర్ణ రుగ్మతలు కూడా వచ్చే ఛాన్సులు ఎక్కువ.
చేపలు - పాలు
చేపలతో భోజనం చేయడానికి ముందు లేదా తర్వాత పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. చేపలతో పాటు వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, చర్మవ్యాధులు, అలెర్జీలు వంటివి రావచ్చు. పాల ఉత్పత్తులు, చేపల కలయిక వల్ల ప్రోటీన్ కంటెంట్ అధికంగా శరీరంలో చేరుతుంది. ఇది జీర్ణక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
చేపలు - సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లను కూడా చేపలు తినే రోజు దూరంగా పెట్టడం అవసరం. సిట్రస్ పండ్లలోని యాసిడ్... చేపల్లోని ప్రొటీన్‌తో చర్య జరుపుతుంది. ఇది అసహ్యకరమైన రుచిని పొందుతుంది. శరీరం పొట్టలో వికారంగా, వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి చేపలు తినేటప్పుడు నారింజ, నిమ్మ వంటి వాటిని దూరంగా పెట్టాలి.
చేపల డీప్ ఫ్రై
చేపలను కూరగా వండుకొని తింటేనే ఎక్కువ ఆరోగ్యం. నూనెలో డీప్ ఫ్రై చేసి తినడం వల్ల అది ప్రాసెస్ చేసిన ఆహారాల జాబితాలోకి చేరిపోతుంది. అలాగే చేపలతో పాటు ఇతర ప్రాసెస్ చేసిన ఆహారాలను, డీప్ ఫ్రై చేసిన ఆహారాలను తినకూడదు. దీనివల్ల అధిక స్థాయిలో సంతృప్త కొవ్వులు శరీరంలో చేరుతాయి. ఇది గుండెకు హాని చేస్తాయి.
బంగాళాదుంపలు
చేపలు తిన్న రోజు బంగాళదుంపలు, పాస్తా వంటి వాటిని దూరంగా పెట్టాలి. వీటిలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. చేపలతో పాటు వీటిని తింటే అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరి జీర్ణవ్యవస్థ పనితీరు క్షీణిస్తుంది.
బీన్స్, చిక్కుళ్లు
అధిక మసాలాలు నిండిన ఆహారాలను కూడా తినకూడదు. చేపలకు అధికంగా కారాన్ని పూసి చాలామంది నూనెలో వేయిస్తారు. అలా చేయడం వల్ల కూడా జీర్ణకోశ అసౌకర్యం, కడుపు ఉబ్బరం వంటివి రావచ్చు.
బీన్స్, చిక్కుళ్ళు వంటి వాటిలో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. చేపలలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. చేపలు తిన్నప్పుడు ఇలా బీన్స్, చిక్కుళ్ళు కూడా తినడం వల్ల శరీరంలో గ్యాస్, ఉబ్బరం వంటివి మొదలవుతాయి. తీవ్రమైన కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. చేపలతో భోజనం చేశాక కాఫీ తాగితే చేపలో ఉన్న పాదరసాన్ని శరీరం గ్రహించుకోకుండా కాఫీ నిరోధిస్తుంది. కాబట్టి చేపలు తినే రోజు పైన చెప్పిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.