Summer Food Tips : వేసవిలో ఈ ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది-dont eat these food in summer details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Don't Eat These Food In Summer Details Inside

Summer Food Tips : వేసవిలో ఈ ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 10:15 AM IST

Summer Food Tips : ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. మండుతున్న వేడితో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఎయిర్ కూలర్లు లేదా ఏసీలను తెచ్చుకోవడం సహా చల్లని పానీయాలను తాగుతున్నారు. అయితే కొన్ని ఆహారాలను ఎండాకాలంలో తీసుకోకపోవడం మంచిది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

కొన్ని ఆహారాలు మీ ఆరోగ్యాన్ని(Health) ప్రభావితం చేస్తాయి. కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఎండాకాలంలో(Summer) ఏది పడితే అది తినడంతో మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది.

సుగంధ ద్రవ్యాలు ఆహార రుచిని పెంచుతాయి. ఇలాంటివి కాస్త తగ్గించాలి. ఎండాకాలంలో నీరు తాగడం(Drinking Water) పెంచాలి. శరీరంలోని వేడితో ఇబ్బందులు ఎదుర్కోవాలసి వస్తుంది.

వేసవి కాలంలో మాంసాహారం(meat), చేపలు, చికెన్, సీ ఫుడ్(Sea Food) వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇది కడుపుని కలవరపెడుతుంది. డయేరియాకు కారణం కావచ్చు.

బర్గర్లు, బజ్జీలతో సహా ఆయిల్ ఫుడ్ తినకండి. వేడి కాఫీ లేదా టీ(Tea) మానుకోండి. అధిక కెఫిన్ కంటెంట్ ఉన్న పానీయాలను నివారించండి.

సీజన్‌లో ఎలాంటి సాస్‌ను తీసుకోవద్దు. ఇందులో 350 కేలరీలు ఉంటాయి. ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది.

వేసవి కాలంలో మీ ఆహారంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. లేకపోతే మీ శరీరం(Body) మీద చెడు ప్రభావం చూపుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచే ఆ ఆహారపదార్థాలు తీసుకోవాలి. ఉష్ణోగ్రత పెరిగినా కడుపుపై చెడు ప్రభావం పడదు. రోజూ తినే ఆహారంలో పెరుగు(Curd)ను తీసుకోవాలి. వేసవి(Summer)లో పొట్టను చల్లబరుస్తుంది. దీంతో ఉదర సమస్యల నుంచి దూరం చేసుకోవచ్చు. మజ్జిగలాగా తాగితే ఇంకా మంచిది.

దోసకాయలో ఫైబర్(Fiber) ఎక్కువగా ఉంటుంది. అధిక నీరు ఉంటుంది. దీంతో శరీరంలో నీటి కొరత ఉండదు. దోసకాయ శరీరాన్ని చల్లగా చేస్తుంది. పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపు సమస్యలు(Stomach Problems) దగ్గరకు రాకుండా చేస్తుంది. ఇది వండే సమయంలో నూనె ఎక్కువగా వాడొద్దు.

పుదీనా ఎండాకాలంలో మంచి ఆహారం(Food)గా ఉపయోగపడుతుంది. పుదీనా తీసుకోవడం కారణంగా శరీరంలో చల్లని ప్రభావం ఏర్పడుతుంది. నిమ్మకాయ(Lemon) నీళ్లలో కలిపి పుదీనా తాగాలి. చట్నీలాగా కూడా చేసుకుని తినొచ్చు. ఉల్లి అనేక వ్యాధులకు మంచిది. పచ్చి ఉపాయను తింటే.. హీట్ స్ట్రోక్ నివారించవచ్చు. వేసవిలో శరీరానికి మేలు చేస్తుంది.

WhatsApp channel