Hottest February in India : ఫిబ్రవరిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. మార్చ్ నుంచి హీట్ వేవ్స్!
Hottest February in India : 100ఏళ్లల్లో తొలిసారిగా.. ఫిబ్రవరిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మార్చ్ నుంచి 3 నెలల పాటు హీట్ వేవ్స్ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది.
Hottest February in India : దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో భానుడి భగభగలకు ప్రజలు భయపడిపోయారు. సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో విద్యుత్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఇక ఇప్పుడు.. అసలైన వేసవి కాలం రాబోతుండటంతో సర్వత్రా భయాందోళన నెలకొంది. ఈ తరుణంలో.. దేశవ్యాప్తంగా మార్చ్ నుంచి మే వరకు హిట్ వేవ్స్ కొనసాగుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతుండటం మరింత ఆందోళనకర విషయం!
100ఏళ్లల్లోనే తొలిసారిగా..
ఫిబ్రవరి అంటే దేశంలో వాతావరణం చల్లగా ఉంటుంది. మార్చ్ మధ్య వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుతాయి. కానీ ఈసారి అందుకు పూర్తి భిన్నంగా.. ఫిబ్రవరి మధ్యలో నుంచే వాతావరణం వేడెక్కింది. ఫిబ్రవరిలో సగటు అధిక ఉష్ణోగ్రత 29.54 డిగ్రీలుగా నమోదైంది. 1901.. అంటే 100ఏళ్ల కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇక ఫిబ్రవరిలో సాధారణ వర్షపాతం కన్నా 68శాతం తక్కువగా నమోదైంది.
మార్చ్ నుంచి మే వరకు.. హీట్ వేవ్స్..!
India heat wave 2023 : దేశవ్యాప్తంగా ఇప్పటికే విద్యుత్ వినియోగం పెరిగింది. ఇక హీట్ వేవ్స్ నేపథ్యంలో అది మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది కూడా ఇదే పరిస్థితులు కనిపించాయి. అనేక చోట్ల డిమాండ్లు అందుకోలేక విద్యుత్ కోతలు నమోదయ్యాయి.
ఈ వార్తల మధ్య గోధుమ పంట ఉత్పత్తిపై ఆందోళన నెలకొంది. హీట్ వేవ్స్‌తో గోధుమ పంట దెబ్బ తినే అవకాశాలు అధికం. ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో హీట్ వేవ్ వార్తలు భయపెడుతున్నాయి.
వరుసగా రెండో ఏడాది.. ఇండియా హీట్ వేవ్స్‌కు సన్నద్ధమవుతోంది.
Heat wave in India : "మార్చ్ నుంచి మే వరకు హీట్ వేవ్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా కేంద్ర, వాయువ్య భారతంపై కనిపించవచ్చు. ఇక మార్చ్‌లో.. ద్వీపకల్పం మినహాయిస్తే.. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి," అని భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఓ ప్రకటన విడుదల చేసింది.
వాతావరణ మార్పులు..
దేశంలో ఈ పరిస్థితులకు వాతావరణ మార్పులే ముఖ్య కారణంగా కనిపిస్తున్నాయి. హీట్ వేవ్స్, వరదలు, కరవు వంటి కారణాలతో ప్రతి యేటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవసాయం దెబ్బతింటుండటంతో ఆహార ద్రవ్యోల్బణం సైతం పెరిగి, సామాన్యుడిపై ఆర్థిక భారం నానాటికి అధికమవుతోంది.
Hottest February 2023 : అదే సమయంలో విద్యుత్ డిమాండ్‌ను అందుకునేందుకు శిలాజ ఇంధన మార్గాలను తవ్వేస్తున్న పరిస్థితి నెలకొంది. హైడ్రోపవర్ వనరులు నానాటికి పడిపోతున్నాయి. వేసవి కాలంలో డిమాండ్‌ను అందుకునేందుకు విద్యుత్ ప్లాంట్లు బొగ్గును భారీ మొత్తంలో దిగుమతి చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి.
ఇక దేశంలో గత 8ఏళ్లుగా పరిస్థితులు బాగాలేవు! హీట్ వేవ్ అనుభవిస్తున్న రాష్ట్రాల సంఖ్య.. 2015 నుంచి 2020 నాటికి రెండింతలు పెరిగింది. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండే ప్రమాదం లేకపోలేదు.