Chiken Prices in Telugu States: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన ధరలు -chiken prices down in andhrapradesh and telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Chiken Prices In Telugu States: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన ధరలు

Chiken Prices in Telugu States: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన ధరలు

HT Telugu Desk HT Telugu
Feb 16, 2023 04:42 PM IST

Chiken Prices in Telugu States: కొద్దిరోజుల నుంచి కొండెక్కిన చికెన్ ధరలు... దిగివచ్చాయి. ఉత్పత్తి ఎక్కువగా ఉండి.. డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఫలితంగా చికెన్ రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి.

తగ్గిన చికెన్ ధరలు
తగ్గిన చికెన్ ధరలు

Chiken Prices in AP and Telangana: ముక్కతో భోజనం .. ఆ మజా చెప్పక్కర్లేదు..! అందులోనూ చికెన్ అంటే.. మహా ఇష్టం. తక్కువ ధరలో దొరుకుతుంది..! కామన్​మ్యాన్​కి నిత్యం అందుబాటులో ఉంటుంది. కానీ గత రెండు మూడు నెలల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు రూ. 300 వరకు ధర పలికిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తగ్గినప్పటికీ రూ. 250 లోపు ఉండుకుంటూ వచ్చింది. కానీ ప్రస్తుతం పరిస్థితి కంప్లీట్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. జనవరి నెలలో 220 నుంచి 260 మధ్య ధరలు ఉండగ... ఇప్పుడా రేటు భారీగా కిందికి వచ్చేసింది. హైదరాబాద్ నగరంలో స్కిన్ లెస్ ధర రూ.170 నుంచి 180 మధ్య ఉంది. ఇక డ్రెస్డ్ చికెన్ రేట్ రూ.150 నుంచి 160 మధ్య ఉంటుంది. పలు ధపాలుగా రేట్లు తగ్గుతూ రాగా... ఇప్పటి వరకు రూ.60 మేర తగ్గింది.

రానున్న రోజుల్లో చికెన్ రేట్లు ఇంకా తగ్గే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని... డిమాండ్ కూడా తగ్గిందని అంటున్నారు. మొన్నటి వరకు పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో చికెన్ వ్యాపారుస్థులకు బాగా కలిసివచ్చింది. అయితే రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు కూడా కాస్త తక్కువగానే ఉన్నాయి. దీంతో ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక బ్రాయిలర్ కోడి లైవ్ ధర రూ.80 నుంచి 90 మధ్యకు పడిపోవడంతో ఫ్రౌల్టీ రైతులు గగ్గోలు పెడుతున్నారు. గిట్టుబాటు ధర కూడా దొరకటం లేదని అంటున్నారు.

మరోవైపు కోడిగుడ్డు రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. రిటైల్‌లో ధరలు చూస్తే ఒక్కో ధర రూ. 6.50 నుంచి రూ. 6కి పడిపోయింది. పలుచోట్ల మాత్రం పాత ధరలకే విక్రయిస్తున్నారు. ఇక ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి పట్టణాల్లో కూడా ధరలు పూర్తిగా పడిపోయాయి. ఇక్కడ కూడారూ.170 నుంచి 180 మధ్య ఉంది. గుడ్డు ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం