Chicken Biryani Recipe : బ్యాచిలర్లూ మీ కోసమే ఇది.. సింపుల్‌గా చికెన్ బిర్యానీ-how to make chicken biryani recipe in telugu here s simple tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Make Chicken Biryani Recipe In Telugu Here's Simple Tips

Chicken Biryani Recipe : బ్యాచిలర్లూ మీ కోసమే ఇది.. సింపుల్‌గా చికెన్ బిర్యానీ

HT Telugu Desk HT Telugu
Feb 11, 2023 11:57 AM IST

Chicken Biryani Making : నాన్ వేజ్ ప్రియులకు చికెన్ బిర్యానీ అంటే మహా ఇష్టం. తింటుంటే.. ఆహా.. ఏమి రుచి అనేలా ఉంటుంది. బ్యాచిలర్లకు మాత్రం వండుకోవడం కష్టం అనుకుంటారు. అయితే సింపుల్ గా చికెన్ బిర్యానీ చేయడం ఎలానో తెలుసుకోండి.

చికెన్ బిర్యానీ
చికెన్ బిర్యానీ (unsplash)

చికెన్ బిర్యానీ(Chicken Biryani) అనగానే నోరు ఊరుతుంది. నాన్ వెజిటేరియన్(non vegetarian) ప్రియులకు ఎంతో ఇష్టం. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్. మన దేశంలో చాలా మంది ఫంక్షన్స్.. ఇతర సందర్భాల్లోనూ బిర్యానీ పెడతారు. ఇదంతా సరే.. బ్యాచిలర్లు కూడా ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు. రోజూ బయట తింటే.. కూడా అనారోగ్యమే. ఇంట్లోనే రెసిపీలు తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మనమే చేసుకున్నాం కదా అని ఓ తృప్తి.

బయటకు వెళ్లి బిర్యానీ తినే బదులుగా.. రూమ్ లోనే బ్యాచిలర్లు బిర్యానీ చేసుకుంటే సరిపోద్ది. అయితే అది పెద్ద కష్టమేమీ కాదు.. కొన్ని టిప్స్ ఫాలో అయి.. వండుకుంటే సరిపోతుంది. పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాస్త ఇంట్రస్ట్ తో చేస్తే చాలు. సింపుల్ గా బిర్యానీ చేసుకునేందుకు ఇక్కడ వివరాలు ఉన్నాయి.

తీసుకోవాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం-రెండు కప్పులు, చికెన్ - హాఫ్ కేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు-ఒక టీస్పూన్, పచ్చి మిర్చి-రెండు, ఉల్లిపాయ-ఒకటి, పెరుగు-అర కప్పు, కారం-ఒక స్పూను, పసుపు-అర స్పూను, గరం మసాలా-అర టీస్పూన్, ధనియాల పొడి-ఒక స్పూను, మసాలా దినుసులు-గుప్పెడు, బిర్యానీ ఆకులు-రెండు, పుదీన-ఒక కట్ట, కొత్తిమీర-ఒక కట్ట, యాలకులు-మూడు, ఉప్పు-రుచికి సరిపోయేలా, నూనె-తగినంత, నెయ్యి-రెండు స్పూన్లు, నిమ్మరసం-ఒక స్పూను

తయారీ విధానం..

ముందుగా చికెన్ ముక్కలను కడిగి ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. మారినేషన్ అయ్యేందుకు 20 నుంచి 30 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద రెండు కప్పుల బియ్యానికి మూడున్నర కప్పుల నీళ్లు పోసి పెట్టాలి. ఇందులో యాలకులతోపాటుగా మసాలా దినుసులు, ఉప్పు కూడా వేసి కలపాలి.

ఇంకోసైడ్.. స్టవ్ మీద బిర్యానీ వండే కళాయి పెట్టి.. అందులో నూనె వేసి ఉల్లిపాయలు తరుగు, పచ్చిమిర్చి వేయించాలి. అందులో మారినేషన్ చేసిన చికెన్ మెుత్తాన్ని వేసి.. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. చిన్న మంట మీద చికెన్ ను ఉడికించాలి. నూనె పైకి తేలే వరకూ కర్రీలా ఉడికించుకోవాల్సి ఉంటుంది. మంట కాస్త తక్కువగా పెట్టుకోవాలి.

అన్నం మెత్తగా ఉడికించొద్దు. స్టవ్ కట్టేసి, ఈ చికెన్ మిశ్రమాన్ని వేయాలి. అన్నం పలుకులుగా ఉంటుంది.. సో కొన్ని నిల్లు చల్లుకోవచ్చు. పైన మూత పెట్టి.. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఓ ఐదు నిమిషాలు.. అలా ఉడికిస్తే.. అన్నం బాగా ఉడికేస్తుంది. పావుగుంటసేపు.. మూత తీయకుండా అలానే వదిలేయాలి. ఇంకేం కాసేపటికి.. వేడి వేడి బిర్యానీ రెడీ.

ఇక స్టవ్ మీద.. నుంచి కిందకు దించాలి. తినేముందు ఎక్కువగా కలుపుకోవద్దు. అలా చేస్తే.. ముద్దముద్దగా అయ్యే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం