Rice Water Benefits : రైస్ వాటర్ తాగితే ఎన్నో ప్రయోజనాలు తెలుసా?-do you know rice water health benefits you will be surprised know in details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Do You Know Rice Water Health Benefits You Will Be Surprised Know In Details

Rice Water Benefits : రైస్ వాటర్ తాగితే ఎన్నో ప్రయోజనాలు తెలుసా?

HT Telugu Desk HT Telugu
Mar 13, 2023 06:44 PM IST

Rice Water : సాధారణంగా అన్నం చేసేటప్పుడు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగి కుక్కర్‌లో వేస్తాం. అయితే ఆ నీళ్లు మాత్రం.. బయటకు పోస్తాం. కానీ వాటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

రైస్ వాటర్
రైస్ వాటర్

సాధారణంగా అన్నం చేసేటప్పుడు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగి కుక్కర్‌లో వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికిస్తారు. బియ్యం నీళ్ళు(Rice Water) పనికిరావు అని కొందరు అనుకుంటారు. బియ్యం నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యానికి, అందానికి రెండింటికీ ఉపయోగపడే అనేక ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

బియ్యాన్ని తీసుకుని ఒకసారి కడిగేయండి. ఆ తర్వాత రైస్ పెట్టండి. ఇప్పుడు రైస్(Rice)కు కావాల్సినంత నీళ్లు పోసి మూతపెట్టి ఉంచాలి. ఆ తర్వాత బియ్యం నీటిని బయటకు తీయండి. తర్వాత మీరు రోజంతా ఈ వాటర్ తాగవచ్చు.

పిల్లల ఆరోగ్యానికి గంజి నీళ్లే వరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికోసం బియ్యం నీళ్లలో నెయ్యి, ఉప్పు కలపాలి.  అన్నాన్ని బాగా మెత్తగా చేసి పిల్లలకు తినిపించాలి. ఎర్ర బియ్యం ఉత్తమం. తెల్ల బియ్యంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

రైస్ వాటర్(Rice Water) జీర్ణక్రియకు సహాయపడుతుంది. డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బియ్యం నీళ్లలో జీర్ణాశయ ఆరోగ్యానికి అవసరమైన మినరల్స్ మరియు ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇందులో చాలా ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరం(Body)లో ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. దీనితో పాటు, శక్తి శరీరం అంతటా వ్యాపిస్తుంది. బట్టలపై ఉన్న మొండి మచ్చలు, మరకలను శుభ్రం చేయడానికి మీరు గంజిని ఉపయోగించవచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్‌లకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

మీరు బియ్యం నీటితో కిచెన్ శుభ్రం చేయవచ్చు. దీని కోసం, బియ్యం నీటిలో బేకింగ్ సోడా, ఉప్పు కలపండి. మీరు దానితో గాజును కూడా శుభ్రం చేయవచ్చు. బియ్యం నీటిలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి త్వరగా శక్తి అందుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అందుకు బియ్యం నీళ్లలో ఉప్పు, నెయ్యి, ఎండుమిర్చి కలుపుకొని సేవించవచ్చు.

మీరు కూరలలో బియ్యం నీటిని ఉపయోగించవచ్చు. చికెన్, పనీర్ కర్రీలో రైస్ వాటర్ ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, బియ్యం నీరు చర్మానికి(Skin) కూడా మేలు చేస్తుంది. బియ్యం నీటితో(Rice Water) చర్మం బాగుంటుంది. చాలామంది మహిళలు బియ్యం నీటిని చర్మం మెరిసేందుకు ఉపయోగిస్తారు. బియ్యం కడిగిన నీరు వయసు వల్ల ఏర్పడే ముడతలు, మచ్చల్ని కూడా పోగొట్టడంలో ఉపయోగపడుతుంది.

బియ్యం నీరు చర్మంపై చాలా మృదువుగా పని చేస్తుంది. సోడియం లారిల్ సల్ఫేట్ వలన కలిగే ఇరిటేషన్ ను ఈ నీరు తగ్గిస్తుంది. వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల వలన కలిగే చర్మ సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేసేందుకు బియ్యం నీరు ఉపయోగపడుతుంది.

WhatsApp channel