Nutmeg Benefits: నిద్ర పట్టడం దగ్గర నుంచి నొప్పులు తగ్గడం దాకా.. జాజికాయతో లాభాలెన్నో..-different nutmeg benefits for good sleep and body pains ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nutmeg Benefits: నిద్ర పట్టడం దగ్గర నుంచి నొప్పులు తగ్గడం దాకా.. జాజికాయతో లాభాలెన్నో..

Nutmeg Benefits: నిద్ర పట్టడం దగ్గర నుంచి నొప్పులు తగ్గడం దాకా.. జాజికాయతో లాభాలెన్నో..

HT Telugu Desk HT Telugu
Oct 30, 2023 07:27 PM IST

Nutmeg Benefits: మంచి నిద్ర నుంచి నొప్పులు తగ్గించే దాకా జాజికాయను బోలెడు రకాలుగా వాడొచ్చు. దానికున్న భిన్న లాభాలేంటో చూసేయండి.

జాజికాయ లాభాలు
జాజికాయ లాభాలు (Freepik)

జాజికాయ కేవలం సుగంధ ద్రవ్యాల్లో భాగమైనదే కాదు.. అది మన ఆయుర్వేద ఔషధాల్లోనూ ముఖ్య స్థానంలో ఉంటుంది. అది బిర్యానీలు, చికెన్‌ కూరలకు మంచి రుచిని ఇవ్వడమే కాదు.. ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. పూర్వ కాలం నుంచీ దీన్ని ఆహారంలో భాగంగా వాడే అలవాటు మన భారతీయులకు ఉంది. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలసుకుంటే మాత్రం మీరు ఆశ్చర్యపోక మానరు.

జాజికాయతో ఆరోగ్య ప్రయోజనాలు:

  • జాజికాయను గొప్ప నొప్పి నివారిణిగా చెబుతారు. కీళ్ల నొప్పులు, పళ్ల నొప్పులు, కండరాల బాధల్లాంటి వాటి నుంచి ఇది ఉపశమనం కలిగిస్తుంది. జాజికాయ నూనెను ఈ నొప్పులు ఉన్న చోట రాసుకుంటే అవి తగ్గుముఖ పడతాయి.
  • జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉన్న క్వర్సటిన్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇది వాపుల్ని తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. శరీరంలో వాపులు, ఆక్సిడేటివ్‌ ఒత్తిడులను ఇది చక్కగా తగ్గిస్తుంది. దీర్ఘ కాలికంగా ఉన్న వాపులపైనా ఇది సానుకూల ప్రభావాన్ని చూపించ గలుగుతుంది.
  • కొందరు నిద్ర లేమితో బాధలు పడుతూ ఉంటారు. చివరికి నిద్ర మాత్రలు వేసుకోవడానికీ అలవాటు పడుతుంటారు. అలాంటి వారు రాత్రి పడుకోబోయే ముందు గోరు వెచ్చని పాలలో కాస్త జాజికాయ పొడి వేసుకుని కలుపుకుని తాగాలి. అందువల్ల నిద్ర బాగా పడుతుంది. ఇన్‌సోమ్నియా సమస్యలు తగ్గుతాయి.
  • దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల నోటి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. పెద్ద పెద్ద బ్రాండ్ల టూత్‌పేస్ట్‌లు, మౌత్‌ వాష్ లకు దీటుగా ఇది నోటిని చెడ్డ బ్యాక్టీరియాల నుంచి రక్షిస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.
  • జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఎగెనోల్‌ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరం, అజీర్ణం లాంటి అన్ని పొట్ట సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. పేగుల్లో ఉన్న చికాకులన్నింటినీ తొలగిస్తాయి.
  • ముఖంపై మొటిమలు, మచ్చలతో బాధ పడేవారికి ఇది ఔషధంలా పని చేస్తుంది. కొద్దిగా జాజికాయను తీసుకుని నీటితో కలిపి పేస్ట్‌లా నూరుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకుంటూ ఉంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
  • ఈ కాలంలో ఎక్కువగా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం లాంటి సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
  • మానసికంగా మనల్ని ప్రశాంతంగా ఉంచడంలో సహకరిస్తుంది. మనస్సులోని ఆవేశం, ఆగ్రహం, ఉద్రేకాలను తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

Whats_app_banner