Ayurveda remedies for acne: మొటిమలు లేని చర్మం కోసం.. 10 ఆయుర్వేద సూత్రాలు..
Ayurveda remedies for acne: యాక్నె, మొటిమల సమస్యలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కారాలేంటో తెలుసుకోండి. అందమైన చర్మం మీ సొంతమవుతుంది.
మొటిమల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. కొన్ని సార్లు సమస్య ఎక్కువైతే దాని వల్ల ఆత్మవిశ్వాసం మీద కూడా ప్రభావం పడుతుంది. ఈ సమస్యకు చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఆయుర్వేదం ప్రకారం సహజంగా మొటిమలు తగ్గించుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి.
యాక్నె తగ్గడానికి ఆయుర్వేద సూచనలు:
- క్లెన్సింగ్: రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి. గాఢత తక్కువున్న క్లెన్సర్ వాడాలి. లేదంటే చర్మంలో సహజంగా ఉండే నూనెలను అది కోల్పోతుంది.
- మూడు దోషాలు తగ్గించే ఆహారం: తినే ఆహారం ద్వారా దోషాలను బ్యాలెన్స్ చేసుకోగలిగితే యాక్నె సమస్య తగ్గుతుంది. తాజా ఆహారం ఎక్కువగా తీసుకుంటూ, బయటి ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించాలి.
- వాతం తగ్గించే ఆహారం: వేడిగా ఉండే ఆహారం తినడం, ఉడికించిన ఆహారం, సరిపోయే నీల్లు తాగడం మంచిది. మరీ చల్లగా ఉన్న ఆహారం తినకూడదు.
- పిత్త దోషం తగ్గించే ఆహారం: శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచే తాజా పండ్లు, కూరగాయలు తినాలి. కారంగా, ఫ్రై చేసిన ఆహారం తినకూడదు.
- కఫం తగ్గించే ఆహారం: తేలికగా ఉండే ఆహారం తీసుకోవాలి. నూనె ఎక్కువగా, ఎక్కువ చల్లగా ఉన్న ఆహారం జోలికి పోవద్దు.
3. మూళికలు: కొన్ని మూళికలకు రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం ఉంటుంది. దానివల్ల మచ్చలేని, అందమైన చర్మం సాధ్యమవుతుంది. వేప, పసుపు, మంజిష్ట, కలబంద కు ఈ గుణాలున్నాయి.
4. త్రిఫల: త్రిఫల చూర్ణం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. శరీరాన్ని శుద్ధి చేస్తుంది. త్రిఫల చూర్ణాన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా వాడొచ్చు. దీన్ని వాడే ముందు డోసేజ్ కోసం ఒకసారి నిపుణుల్ని సంప్రదించండి.
5. సహజ ఫేస్ వాష్: చందనం పొడి, పసుపు లేదా వేప పొడి ముద్దను ముఖం కడుక్కోడానికి వాడొచ్చు. వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయి.
6. ఒత్తిడి: ఒత్తిడి వల్ల యాక్నె రావచ్చు. యోగా, మెడిటేషన్, శ్వాస వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గించుకోవాలి.
7. నిద్ర: రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
8. వ్యాయామం: రోజూ శారీరక వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో ఉన్న మలినాలు బయటకు పంపివేయబడతాయి.
9. ముఖాన్ని తాకడం: తరచూ ముఖాన్ని తడమటం, లేదా గిల్లడం చేయొద్దు. దీనివల్ల బ్యాక్టీరియా చేరి సమస్య ఇంకా ఎక్కువవుతుంది.
10. హైడ్రేషన్: కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల చర్మం తేమగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది.