Did You Know : జంబలకిడి పంబ.. లింగం మార్చుకుంటున్న చేపలు
Fish Change Sex In Adulthood : లింగ మార్పిడి కోసం టెక్నాలజీ అనేది వచ్చేసింది. మనుషుల్లో లింగమార్పిడి చేసుకున్న వాళ్లను చూస్తుంటాం. కానీ చేపలు వాటంతటవే.. లింగమార్పిడి చేసుకుంటాయని తెలుసా? ఏకంగా 500 రకాల చేపల జాతుల్లో ఇలా జరుగుతుంది. శాస్త్రవేత్తలే ఈ విషయం చూసి షాక్ అవుతున్నారు.
మనిషి లింగ మార్పిడి చేసుకోవాలంటే.. ఆపరేషన్ అవసరం. చాలా టెక్నాలజీ(Technology) కావాలి. కానీ కొన్ని రకాల చేపల జాతులు.. వాటంతటవే.. లింగం మార్పిడి చేసుకుంటున్నాయి. ఈ విషయం తెలిసి.. శాస్త్రవేత్తలో ఆశ్చర్యపోయారు. మూడునాలుగేళ్ల క్రితం ఈ విషయాన్ని కనుగొన్నారు సైంటిస్టులు. అయినా ఇప్పటికి ఆశ్చర్యంగానే ఉంటుంది ఈ విషయం.
చేపల్లో అనేక రకాల జాతులు ఉంటాయి. అందులో మనకు తెలిసినవి కొన్నే. ఇక తెలియనివి ఎన్ని ఉంటాయో కదా. సముద్రంలో, నదుల్లో ఇలా.. మనం చూడని రకరకాల చేపల జాతులు ఉంటాయి. అయితే ఓ 500 రకాల చేపలు మాత్రం.. మెుదట ఆడ చేపలుగా ఉండి.. ఆ తర్వాత.. కాలక్రమేణా మగ చేపలు(Fish)గా మారిపోతున్నాయి. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. వాటి లింగం మార్చుకున్నాక.. పది రోజుల్లోనే ఆడ చేపలతో సంభోగంలో పాల్గొంటున్నాయి. శాస్త్రవేత్తలు వీటిపై ప్రత్యేక పరిశోధనలు చేశారు.
'నీలి రంగు తల ఉండే వ్రస్సే, క్లోన్ ఫిష్ రకాలకు చెందిన ఆడ చేపలు మధ్య వయస్సులో మగ చేపలుగా మారుతాయి. మెుదట ఆడ చేపగా మగ చేపలతో కలిసి జీవిస్తాయి. అయితే మగ చేప చనిపోయాక.. వాటి జీవన ప్రక్రియ పూర్తిగా మారుతుంది. పరిస్థితులకు అనుగుణంగా అవి మగ చేపలా ప్రవర్తిస్తాయి. అనంతరం.. వాటిలో గర్భం దాల్చేందుకు ఉపయోగపడే.. హార్మోన్ అరోమాటసీ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఆ తర్వాత శరీర మార్పులు ఉంటాయి. పురుష చాపలకు ఉండేలాంటి అవయవాలు.. వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆడ చేపలతో సంభోగంలో పాల్గొంటాయి.' అని సైంటిస్టులు చెప్పారు.
బ్లూహెడ్ రాస్‌లు కరేబియన్‌లోని పగడపు దిబ్బలపై సమూహాలలో నివసిస్తాయి. నీలిరంగు తలతో ఉండే.. ఆధిపత్య పురుష చేప.. పసుపు రంగులో ఉండే ఆడ చేపల అంతఃపురాన్ని రక్షిస్తుంది. మగ చేప చనిపోతే.. ఆడ చేప కేవలం 10 రోజుల్లో మగ చేపలా అవుతుంది. వాటి ప్రవర్తనను నిమిషాల్లో, రంగు గంటల్లో మార్చేసుకుంటాయి. చేప అండాశయం వృషణంగా మారుతుంది. 10 రోజులలో అది స్పెర్మ్‌ను తయారు చేస్తుంది.
సెల్యులార్ 'మెమరీ'లో మార్పుల ద్వారా కూడా అద్భుతమైన పరివర్తన సాధ్యమవుతుందని పరిశోధకులు అంటున్నారు. కణాలు శరీరంలో వాటి నిర్దిష్ట పనితీరులో మార్పు చేసుకుంటాయి. లింగం మార్పు రసాయనల మార్పుతో ఉంటుంది. ఆ చేపలలో సెక్స్ రివర్సల్ జన్యువులను కలిగి ఉన్నాయి.