Operation Raavan First Look: ఆలోచనలే శత్రువులంటున్న పలాస హీరో.. ఆపరేషన్ రావణ్ ఫస్ట్ లుక్ విడుదల
Operation Raavan First Look: పలాస 1978 చిత్రంతో ప్రేక్షకులను అలరించిన హీరో రక్షిత్ అట్లూరి. తాజాగా అతడు నటించిన సరికొత్త చిత్రం ఆపరేషన్ రావణ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
Operation Raavan First Look: మూడేళ్ల క్రితం వచ్చిన పలాస 1978 చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పీరియాడికల్ యాక్షన్ సిరీస్‌లో పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన పలాస్ ఫేమ్ రక్షిత్ అట్లూరి.. త్వరలో సరికొత్త కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఆ చిత్రం పేరు ఆపరేషన్ రావణ్. ఈ యువ హీరో సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ చిత్రంతో వెంకట సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రక్షిత్ లుక్ బాగుంది. నీ ఆలోచనలే నీ శత్రువులు అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మేఘా-ఒమేఘా విద్యా సంస్థల వైస్ ఛైర్మన్ శ్రీమతి మాలతి రెడ్డి ఈ పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఈ ఆపరేషన్ రావణ్ సినిమాలో రక్షిత్ అట్లూరి సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్‌గా చేస్తోంది. అంతేకాకుండా సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, నటుడు చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్లో నిమగ్ననమైంది. ఈ చిత్రంతో వెంకట సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శరవణం వాసుదేవన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నారు.
సంబంధిత కథనం